Saturday, May 4, 2024
- Advertisement -

పోగొట్టుకున్నచోటే దక్కించుకుంటున్న జగన్

- Advertisement -

గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నంలో చేదు అనుభవం ఎదురైంది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విశాఖ లోక్ సభ స్థానానికి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో వైఎస్ జగన్ ఆ స్థానాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. 2014 ఎన్నికల తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ విశాఖలో తమ పార్టీ జెండా ఎగిరేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు విశాఖ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు యాక్టివ్ గానే ఉన్నారు. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రైల్వే ప్రత్యేకజోన్ సహా ఇతర సమస్యలపైనా దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు పాదయాత్రలోనూ జగన్ స్థానిక సమస్యలపై పదే పదే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. జగన్ యాత్రలో దారిపొడవునా జనం పోటెత్తుతున్నారు. మండుటెండలోనూ జోరువానలోనూ జనం బారులు తీరుతున్నారు. విశాఖలో జగన్ సభలకు పాదయాత్రకు వస్తున్న జనప్రభంజనాన్ని చూస్తుంటే పోగొట్టుకున్నచోటే జగన్ ప్రజాభిమానం దక్కించుకుంటున్నాడనే అర్ధమవుతోంది. గతంలోనూ ఆయన సభలకు జనం భారీగా వచ్చినా, అప్పటికీ ఇప్పటికీ జనం ఆలోచనలో తేడా వచ్చింది. జగన్ మీద ఓ ఆశ నమ్మకం వారిలో కనిపిస్తున్నాయి. ఈ సారి పట్టం కట్టే అవకాశాలను తీసి పారేయలేం.

విశాఖ జిల్లాలో ఓ వైపు జనం తండోపతండాలుగా జగన్ పాదయాత్రకు వస్తుంటే, మరోవైపు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఓ గొప్ప ప్రోగ్రామ్ కండెక్ట్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రజా సమస్యలు ప్రతిబింబించేలా, జనం అవస్థలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్ నిర్వహణకు సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్రలోని ప్రజాసమస్యలకు అద్దం పట్టేలా, పాలకుల కళ్లు తెరిపించేలా ఈ ఫిల్మ్స్ ఉండాలని ప్రకటన జారీ చేశారు. ఈ మూడు జిల్లాల్లోని ప్రధాన సమస్యలను ఈ షార్ట్ ఫిల్మ్స్ డాక్యుమెంటరీ ద్వారా వెలుగులోకి తెస్తే, ప్రస్తుత ప్రతిపక్షంగా, రేపు అధికారంలోకి వచ్చాక తమ పార్టీ వాటి పరిష్కారానికి కృషి చేస్తుందని విజయసాయిరెడ్డి తెలిపారు.

డాక్యుమెంటరీ నిడివి 15 నిముషాలకు మించరాదు. ఈ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ 5 లక్షలు, రూ 2 లక్షలు, రూ 50 వేలు ఉంటాయి. షార్ట్‌ఫిల్మ్‌ నిడివి 10 నిమిషాలుగా నిర్ణయించారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ల కింద వరుసగా రూ. 5లక్షలు, రూ.2లక్షలు, రూ.50వేలు, అందజేయనున్నారు.

ఈ కాంపిటీషన్స్ లో పాల్గొనేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. నవంబర్ 30వ తేదీలోగా తమ ఎంట్రీలను పంపాలని విశాఖ వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ కోరింది. పూర్తి వివరాలకు 76598 64170 ఫోన్‌ నంబర్‌లో లేదా ysrcp vizagitwing@gmail. com, ఈ మెయిల్‌ లేదా www.ysrcpvizagitwing.com వైబ్‌సైట్‌ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. ఇంకెందుకు ఆలస్యం మీ ప్రతిభకు పదును పెట్టండి. ప్రజాసమస్యపై స్పందించండి. విజేతలుగా నిలవండి. ఆల్ ద బెస్ట్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -