సినిమా కథ చెప్పినప్పుడు బాగానే ఉంటుంది.. ఆ కథను ఊహించుకొని హిట్టావుతుందా.. ఫట్టవుతుందా అని అంచనా వేస్తారు.. ఆలోచన చేస్తారు. ఈ విధంగా ఆలోచించిన తర్వాత సినిమా చేయాలా? వద్దా? అని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకున్నది ఒక్కోసారి కరెక్టవుతది.. మరోసారి తప్పు అవుతుంది. ఇప్పుడు ఒక హీరోయిన్ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద మిస్టేక్‌గా మిగిలింది. ఫలితంగా తన కెరీర్‌లో వచ్చిన మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. ఆమెనే మమతా మోహన్‌దాస్.
అసలు సంగతేమిటంటే.. అనుష్క చేసిన ‘అరుంధతి’ సినిమా సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాతో అనుష్క స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమా మొదట మమతా మోహన్‌దాస్ దగ్గరకే వచ్చిందట! సినిమా కథ విన్న తరువాత సినిమా హిట్ అవుతుందా? లేదా? అనే అనుమానంతో ఆ సినిమా వదులుకుంది. మమత ఒప్పుకోకపోవడంతో అనుష్కను సంప్రదించి సినిమా చేశారు. ఆ తర్వాత ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీఅందరికీ తెలిసిందే.
ఆ సినిమా విడుదలై పది సంవత్సరాలైనా ఏ హీరోయిన్ ఆ సినిమాను మరిచిపోలేని పరిస్థితి. ఆ సినిమా తరువాత అనుష్క ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు హీరోయిన్ ఒరియెంటెడ్ సినిమాలకు అనుష్క కేరాఫ్‌గా నిలుస్తోంది. ఆ సినిమా వదులుకొని తప్పు చేశానని మమత ఇప్పుడు బాధపడుతోంది. ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు అనుష్క స్థానంలో మమత ఉండేది. అందుకనే సినిమాలు చేసేప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. లేకుంటే పెద్ద ప్రమాదాలే జరుగుతాయి. ఇప్పుడు మమత మోహన్‌దాస్‌ను ప్రేక్షకులు మరచిపోయారు.