ఫోటో షూట్ లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ భామ..

- Advertisement -

తెలుగు, మలయాళ సినీ నటి మమతా మోహన్ దాస్. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన బ్యూటీ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. యమదొంగ సినిమా తో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఈ బ్యూటీ హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్ లను పాడి మంచి విజయాన్ని అందించింది.

విక్టరీ వెంకటేష్ నటించిన చింతకాయల రవి సినిమాల్లో కూడా నటించింది. ఆ తర్వాత కేడి సినిమాల్లో నటించగా.. ఇక మళ్లీ తెలుగులో ఏ సినిమాలో కనిపించలేదు ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగు సినీ పరిశ్రమకు 11 ఏళ్ళ దూరమున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన ఫాలోవర్స్ తో బాగా పంచుకుంటుంది.

- Advertisement -

Also read:అషుతో డేటింగ్ పై రాహుల్ షాకింగ్ కామెంట్స్..!

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలు, వీడియో లను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారాయి. అందులో బోల్డ్ లుక్ తో బ్లూమూన్ వెలుగులో ఓ గుర్రం పై కూర్చొని ఫోటోకు ఫోజు ఇచ్చింది ఈ గ్లామర్ బ్యూటీ. ఈ ఫోటో ఒక మ్యాగజైన్ కోసం షూట్ చేయగా.. తాజాగా ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఓ వీడియో లో కూడా అందులో తను షూట్ లో పాల్గొన్న విధానాన్ని కూడా రికార్డ్ చేసి ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక ఇటీవలే బైక్ డ్రైవ్ తో కూడా అందర్నీ ఫిదా చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ లాల్ బాగ్ అనే సినిమాలో నటిస్తుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల కానుంది.

Also read:రెండో సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు వీళ్ళే!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -