Thursday, May 2, 2024
- Advertisement -

ప్రకాష్ రాజ్ కూడా దసరా కే

- Advertisement -

తమన్నా-ప్రభుదేవాల త్రిభాషా చిత్రం ‘అభినేత్రి’ కూడా అక్టోబరు 7నే వస్తుందని కన్ఫమ్ అయింది. మరోవైపు కన్నడ కుర్రాడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయవుతున్న ‘జాగ్వార్’ను దసరా సీజన్లోనే బరిలోకి దించుతున్నారు. ఇవన్నీ చాలదన్నట్లు పోటీలోకి ప్రకాష్ రాజ్ కూడా వచ్చేశాడు.

ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘మన ఊరి రామాయాణం’ను దసరా కానుకగా అక్టోబరు 7నే రిలీజ్ చేస్తారట. ఈ సినిమా మీద ఇప్పటికైతే పెద్దగా హైప్ లేదు. దీనికి ప్రకాష్ ప్రమోషనే మొదలుపెట్టలేదు. ఆ మధ్య ఒక టీజర్ మాత్రం రిలీజ్ చేశాడంతే. తెలుగు-కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రకాష్ రాజ్.. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో దసరాకే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. చూస్తుంటే మంచి సినిమాలాగే అనిపిస్తోంది కానీ.. ఇంత పోటీ మధ్య వస్తే సినిమా  అన్యాయమైపోతుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి ప్రకాష్ మనసు మార్చుకుంటాడా.. ఇప్పుడు చెబుతున్న డేటుకే కట్టుబడతాడా అన్నది చూడాలి.

{youtube}-vVY2p1xOwQ{/youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -