Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబు తో తలనొప్పి వారికి కాస్త తగ్గింది

- Advertisement -

‘నేను నిద్రపోను – మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే నినాదానికి పేటెంట్ కలిగి ఉన్న చంద్రబాబునాయుడు ఈ విడతలో అధికారుల్ని ఆ మేరకు వెంటాడుతున్నాడో లేదో గానీ.. మంత్రులికి మాత్రం చుక్కలు చూపిస్తున్నారు.

అసలే మంత్రి పదవి భారం – తమ సొంత జిల్లాల్లో పని – వీటికి తోడు ఇన్చార్జి మంత్రులుగా మరో జిల్లా పని .. ఇన్నింటి నడుమ.. వారికి రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఒక్కొక్కరికి ఒకటి రెండు జిల్లాల ఇన్చార్జి బాధ్యత అప్పగించి.. కరవు రైతుల్ని పరిశీలించి ఊరడించే పని అప్పగించారు. ఈ పనిలో వారికి చుక్కలు కనిపించాయి. మధ్యలో చంద్రబాబు కూడా అదే జిల్లాకు వచ్చేయడంతో వారికి ప్రచారం కూడా తగ్గిపోయింది.

కాకపోతే.. వర్షాలు రావడంతో.. ఈ ‘బాబుభారం’ దిగిందని వారు సంతోష పడుతున్నారు. మంత్రులంటే పొందూరు ఖద్దర్ వేసుకుని – ఏసి గదుల్లో గడుపుతూ – ప్రోటోకాల్ హంగామాతో ఏసి వాహనాలలో వెళుతూ వుండటం ఆనవాయితి. అలా హాయిగా కాలం గడిపేద్దాం అనుకుంటున్న మంత్రులకు చంద్రబాబు వల్ల పెద్ద చిక్కు వచ్చి పడింది. హైటెక్ ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకున్నాను అనుకుంటున్న చంద్రబాబు నాయుడు వేసే కమిటిలు వల్ల గాని జిల్లాలకి వేసే ఇంఛార్జ్ వల్ల వొరిగేది ఏమి లేదని జనం అనుకుంటూనే ఉంటారు.

నియోజకవర్గానికి ఎం.ఎల్.ఏ వుండగా ప్రతిజిల్లాకి ఒక ఇంచార్జ్ మంత్రిని – ఇప్పుడు రాయలసీమకి ఇంఛార్జ్ లను వేసారు. వీరి పని కరవు రైతుల్ని ఊరడించడమే. అందుకని వీరు రాయలసీమలో ఎండిన పోలాల్లోకి వెళ్ళి వేరుసెనగ పైరుని పీకి ఫోటోకి ఫోజిచ్చి పేపర్లో వార్త వ్రాయమని వేడుకుంటూ వచ్చారు. ఒకే జిల్లాలో బోలెడు మంత్రులు ఎవరికీ పెద్ద కవరేజీ దక్కలేదు.

పైగా చంద్రబాబు కూడా అదే జిల్లాకు వచ్చాక వారికి అసలు పబ్లిసిటీ లేకుండా పోయింది. ఆయన నమ్మాలంటే.. మీడియాలో కనపడాల్సిందేనని వారి ఆవేదన. ఇలా వారు కష్టాలు పడుతూ ఉండగా.. మధ్యలో వర్షాలు వచ్చి వారి బాధల్ని తగ్గించాయి. ఇన్చార్జి పని రూపంలో పొలాల్లోకి వెళ్లేలా బాబు అప్పగించిన పని.. ప్రస్తుతానికి తప్పినట్లేనని వారు ఊపిరి పీల్చుకుంటున్నారట.

Related

  1. చంద్రబాబు గారూ నిద్ర లేవండి
  2. కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడానికి చంద్రబాబు రెడీ ?
  3. కెసిఆర్ vs చంద్రబాబు
  4. షాకింగ్ : పుష్కరాల్లో చంద్రబాబు కి పిండ ప్రధానం
  5. చంద్రబాబు కి ఒళ్ళు మండే మాట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -