Monday, May 20, 2024
- Advertisement -

మంచువారబ్బాయి… ప్రయోగాలకు చక్కని కుర్రాడు

- Advertisement -

మంచు వారబ్బాయిలో సరైన సక్సెస్ లేక ఇంకా… కరెక్ట్ ట్రాక్ కోసం పాకులాడుతోన్న హీరో ఎవరంటే అంతా మనోజ్ పేరు చెబుతారు. కాని మాంచి ఎనర్జటిక్ , డేరింగ్ అండ్ డ్యాషింగ్ అంటే మాత్రం టాలీవుడ్లో మనోజ్ పేరే చెబుతారు. ఎందుకంటే మనోడిలోని ఫైర్ అంటే అందరికీ అంత ఇష్టం. మిస్టర్ నోకియా, ఊ కొడతారా ఉలిక్కిపడతారా, పోటుగాడు చిత్రాలు చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్ధమవుతుంది.

తాజాగా అతను చేసిన ఒక్కడు మిగిలాడు చూస్తే… ఎవరికైనా ఇదే విషయం లో ఆలోచన రాక మానదు. మన తెలుగులో ఎందరో ప్రయోగాలు చేసే దర్శకులుండగా వారికి మనోజ్ కనిపించడా అని కొశ్చన్ చేయకుండా ఉండరు. శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు సినిమాలో రెండు విభిన్న పాత్రలో నటించిన మనోజ్‌ ఆకట్టుకున్నాడు.

మనకు తెలిసి ఎక్కువగా అల్లరి క్యారెక్టర్‌ లు మాత్రమే చేసిన మనోజ్‌ ఈ సినిమాతో బరువైన ఎమోషన్లు కూడా పండించగలడని ప్రూవ్‌ చేసుకున్నాడు. సూర్య పాత్రలో నేచురల్‌ గా కనిపించిన మనోజ్‌, పీటర్‌ పాత్రలో కాస్త డ్రమెటిక్‌గా కనిపించాడు. ఈ మంచువారబ్బాయిని క్రియేటివ్ డైరెక్టర్లు కాస్త సాన బెడితే… మాంచి అవుట్ పుట్ ను రాబట్టవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -