Saturday, April 27, 2024
- Advertisement -

సినిమాలో రానా కనిపించలేదన్న డైరెక్టర్

- Advertisement -

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ‘పవన్‌ మేనియా’ కనిపిస్తోంది. భీమ్లా నాయక్ సినిమా ‘సూపర్‌ హిట్‌’ అంటూ అందరూ వరుస పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్‌ ప్రముఖులు సైతం ‘భీమ్లా నాయక్‌’పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఒకే ఫ్రేమ్‌లో నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు. సినిమాపై సానుకూల స్పందనలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకు, నా డార్లింగ్ రానా దగ్గుబాటికి మరియు చిత్ర బృందానికి అభినందనలు. బొమ్మ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’ అని మనోజ్ ట్వీట్ చేశారు. డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ ‘భీమ్లా నాయక్‌’పై తన అభిప్రాయం చెప్పాడు. ‘భీమ్లానాయక్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ సింహ గర్జన చేశారు. చాలా రోజు తర్వాత థియేటర్‌లలో పవన్ నట గర్జన చూడటం అద్భుతంగా ఉంది.

రానాలో నేను కేవలం డేనియల్‌ శేఖర్‌ని మాత్రమే చూశా. నువ్వు అదరగొట్టేశావు. తమన్ అందించిన మ్యూజిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇది బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ ఆఫ్‌ భీమ్లా! నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బావా. సాగర్‌ కె చంద్ర, త్రివిక్రమ్‌, నాగవంశీకి అభినందనలు’ అని హరీశ్‌ శంకర్‌ వరుస ట్వీట్లు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -