Tuesday, April 30, 2024
- Advertisement -

కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన మంచు మ‌నోజ్‌

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ముందస్తు ఎన్నిక‌లు వెళ్తున్న సంగ‌తి తెలిసిందే.అయితే ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపే టాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవరు స్ప‌దించ‌లేదు.కేసీఆర్ ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే అంద‌రు తెరుకుంటున్నారు.తాజాగా కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై హీరో మంచు మ‌నోజ్ స్పందించారు. కేసీఆర్ రాజీనామా చేశాక బహిరంగంగా మద్దతు ప్రకటించిన హీరో మంచు మనోజ్ మాత్రమే.

మనోజ్ మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. మంచు మనోజ్ టీఆర్ ఎస్ కు మద్దతుగా చేసిన ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.త్వ‌ర‌లో సీని ఇండ‌స్ట్రీ నుంచి మ‌రికొంత మంది కేసీఆర్‌కు త‌మ మ‌ద్దతు తెలుపుతార‌ని టీఆర్ఎస్ ఆశాభావం వక్తం చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -