Monday, May 13, 2024
- Advertisement -

గీతా మాధురిపై నెగిటివ్ కామెంట్స్.. నందు ఆగ్ర‌హం

- Advertisement -

బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది గీతా మాధురి.దానికి త‌గినట్లుగానే గీతా మాధురి షో మొద‌ట్లో త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంది.కాని గ‌త కొంత‌కాలంగా గీతాలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి.దీంతో గీతా మాధురిపై సోష‌ల్ మీడియ‌లో విప‌రీత‌మైన నెగిటివ్ కామెంట్స్ ఎక్కువైయ్యాయి.కౌశ‌ల్‌తో ఆమె ప్ర‌వ‌ర్తించిన తీరుతో కౌశ‌ల్ ఆర్మీ గీతాపై ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు.ఇక సామ్రాట్‌తో గీతా వ్య‌వ‌హరం ఏం బాలేద‌ని స‌గ‌టు ప్రేక్ష‌కుడు కూడా అభిప్రాయ‌పడుతున్నారు.నాని కూడా ఈ విష‌యంపై హెచ్చ‌రించిన‌,దానిని లైట్‌గా తీసుకుంది గీతా.కౌశ‌ల్‌ను సీజ‌న్ మొత్తం ఎలిమినేష‌న్‌కు నామినేట్ చేయ‌డంతో ఆమెపై వ్య‌తిరేక‌త ఎక్కువైంది.

గీతా మాధురిపై అసభ్యకర పదజాలంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్స్ చేస్తున్నారు. గీతా మాధురిని ఇలాంటి కామెంట్స్ చేయ‌డంపై ఆమె భ‌ర్త నందు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నందు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. బిగ్ బాస్ అనేది గేమ్ షో.. అందులో జరిగే పరిణామాలపై అభిప్రాయలు వ్యక్తం చేయడంలో తప్పు లేదు కానీ వ్యక్తిగతమైన కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు.ఒక మహిళను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం మన సంస్కారం కాదు అంటూ చెప్పుకొచ్చాడు.అయితే ఈ వీడియో పెట్టిన కొన్ని గంట‌ల్లోనే తొల‌గించాడు నందు.ఈ వీడియో వ‌ల్ల గీతాకు ఎక్కువ న‌ష్టం జ‌రుగుతుంద‌ని భావించిన నందు వెంట‌నే ఈ వీడియోను తొల‌గించిన‌ట్లు తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -