Friday, May 3, 2024
- Advertisement -

కాజల్ ని హాలీవుడ్ కి తీసుకెళ్లనున్న మంచు హీరో

- Advertisement -

హీరో మంచు విష్ణు కెరీర్ ఏమంత బాగా లేదు. గత కొంతకాలంగా డిజాస్టర్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. హీరోగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు ఇప్పుడు నిర్మాతగా కూడా మారనున్నాడు. ఈ మధ్యనే వి ఎమ్ ఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం తో చేతులు కలిపిన హీరో విష్ణు ఒక హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యాడు అని వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంగ్లీష్ లోనే కాక తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటిస్తుందని సమాచారం.

ఆమె ఎవరో కాదు కాజల్ అగర్వాల్ అని తెలుస్తోంది. ఈ పాత్రకి కాజల్ అయితే సూటవుతుందని దర్శకనిర్మాతలు అనుకున్నారట. ఈ నేపథ్యంలో ఆమెను కలిసి స్క్రిప్ట్ కూడా వినిపించారట. కాజల్ కి కథ బాగా నచ్చింది అని తెలుస్తుంది. కానీ ఆమె ఇంకా ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాల్సి ఉంది. ఒక హాలీవుడ్ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విష్ణు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -