Wednesday, May 1, 2024
- Advertisement -

సుప్రీంకోర్ట్ బిగ్ షాక్‌…చిక్కుల్లో ఏపీ మాజీ సీఎం

- Advertisement -

ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకం పై నిషేధం విధించాలని సుప్రీంలో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచార‌న‌తో ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డ్డారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబు భారీగా న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కాల‌యిన ప‌సుపు-కుంకుమ‌, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారని పిటిషనర్ వివరించారు.

ఈ పిటిష‌న్‌ను విచారించిన సుప్రీం ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన చంద్రబాబు పథకాలపై నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. అటు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది.

ఎన్నికలకు ముందు ప్రభుత్వ పథకాల పేరుతో నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ జనసేన పార్టీ నేత పెంటపాటి పుల్లారావు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -