Monday, April 29, 2024
- Advertisement -

ఎన్నిక‌ల పోటీకి రెడీ అవుతోన్న మంచు విష్ణు

- Advertisement -

అన్ని రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌లకు స‌న్న‌ద్దం అవుతుంటే , హీరో మంచు విష్ణు కూడా ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్నాడు. అయితే మంచు విష్ణు ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాడ‌ని అనుకుంటున్నారా ఏంటీ..? అదేం కాదులేండి మంచు విష్ణు హీరోగా న‌టించిన చిత్రం ఈ ఎన్నిక‌ల ముందు విడుద‌ల కానుంది. మంచు విష్ణు హీరోగా న‌టించిన ఓట‌ర్ సినిమా టీజ‌ర్ విడుద‌ల అయింది. ఎప్ప‌డో మొద‌లైన ఈ సినిమా ఇటీవ‌లే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

తాజ‌గా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ‘అహింసా మార్గం ద్వారా..ఒక్క బులెట్ కూడా కాల్చకుండా.. స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది..’ ‘మనం పేదరికం పైన పోరాటం చేశాం కానీ పేదలపైన పోరాటం చేయలేదు..’ ‘మార్పు మనలో రావాలి..మారాలి.. మార్చాలి.. మొదటగా మనం మార్చాల్సింది దేశంలో ఉన్న రాజకీయాల నాయకులని మంచు విష్ణు చెప్పే డైలాగులు అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మంచు విష్ణు త‌రుపున పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగిన అలాంటిది ఏమి లేద‌ని తెలిపోయింది.

ఇటీవ‌లే ఏపీ సీఎం చంద్ర‌బాబుపై మంచు మోహ‌న్ బాబు, మంచు మంచు విష్ణు ప‌లు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.ఇక ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని భావించి ఓట‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా సౌరభి న‌టిస్తోంది. ఈసినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా, జిఎస్ కార్తీక్ దర్శకత్వం వ‌హించారు. ఇక సినిమాను మార్చి చివ‌ర్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=07OUC_7XMYs

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -