Monday, May 6, 2024
- Advertisement -

మన్మధుడు 2 లో బోల్డ్ గా మరీనా రకుల్

- Advertisement -

నాగార్జున ప్రధాన పాత్ర లో మన్మధుడు 2 అనే సినిమా తెరకెక్కించబడింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు గా పూర్తి అయింది. నిర్మాణాంతర పనులు కూడా ప్రస్తుతం శరవేగం గా జరుగుతున్న విషయం మనకి తెలిసిందే. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే, సినిమా యూనిట్ ప్రమోషన్స్ విషయం లో మంచి ప్లానింగ్ తో ఉంది. ఇప్పటికే విడుదల అయినా టీజర్ మంచి రెస్పాన్స్ ని తీసుకొని రాగా, ఇక ఈ రోజు రకుల్ ప్రీత్ పాత్ర మీద విడుదల అయినా టీజర్ ఏకంగా సినిమా ని మరో లెవెల్ కి తీసుకొని వెళ్ళింది అని చెప్పొచ్చు.

సినిమా లో రకుల్ ప్రీత్ అవంతిక అనే పాత్ర లో మెరవనుంది. ఈ టీజర్ ప్రథమార్థం లో రకుల్ ప్రీత్ ఒక అమాయకపు, సాంప్రదాయ అమ్మాయి లాగా చూపించబడింది. వెంటనే ఒక్కసారి గా పెద్ద చేంజ్ తీసుకొని వస్తూ రకుల్ ప్రీత్ ని బోల్డ్ గా, ఒక న్యూ ఏజ్ అమ్మాయి లాగా చూపించారు. అంతే కాకుండా టీజర్ చివరన రకుల్ ప్రీత్ సిగరెట్ కాలుస్తూ కూడా కనిపిస్తుంది. డయలాగుల్లో కూడా డబుల్ మీనింగ్ గోచరించేలా అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే సినిమా కి తప్పకుండా U/A సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -