Tuesday, April 30, 2024
- Advertisement -

‘ఫ‌స్ట్ ర్యాంక్ రాజు` క‌న్న‌డ సినిమాను మారుతీ రీమేక్‌

- Advertisement -

విద్యా వ్య‌వ‌స్థ ఎంత భ్ర‌ష్టు ప‌ట్టిందో అంద‌రికీ తెలిసిందే. అయితే క‌న్న‌డ‌లో ‘ఫ‌స్ట్ ర్యాంక్ రాజు` సినిమా విద్యా వ్య‌వ‌స్థ‌ ఎలా ఉందో… ర్యాంకుల వేట ఎలా ఉంటుందో క‌ళ్ల‌కు క‌ట్టి ప్ర‌భుత్వానికి పెద్ద పాఠ‌మే నేర్పింది ఈ సినిమా. అయితే ఈ సినిమా క‌న్న‌డ‌లో సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. అక్క‌డ ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకొంది. విద్యావేత్త‌ల‌ను, ప్ర‌జ‌లను ఆలోచింప‌జేసిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌డానికి చూస్తున్నారు.

ఈ సినిమాను ద‌ర్శ‌కుడు మారుతి తెలుగులో రీమేక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఇంత‌కుముందే ఆ సినిమా తెలుగు హ‌క్కుల‌ను మారుతీ చేజిక్కించుకున్నారు. అయితే ఈ సినిమాకు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం చేస్తారా, లేదంటే కేవ‌లం నిర్మాత‌గానే ఉండిపోతారా అనేది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం మారుతీ నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆయ‌న క‌మిట్మెంట్స్ ఆయ‌న‌కు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మారుతీ త‌న శిష్జ్ఞుడిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేయ‌డానికి చూస్తున్నాడ‌ని స‌మాచారం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -