Tuesday, April 30, 2024
- Advertisement -

వివాదాస్ప‌ద జ్యోతిక పాత్ర‌లో అనుష్క

- Advertisement -

తమిళంలో ‘నాచియార్’ సినిమా మొద‌ట వివాదాస్ప‌దంగా మొద‌లైనా ఆ త‌ర్వాత సినిమా విడుద‌లయ్యింది. ఆ సినిమాలో జ్యోతిక ప్రధాన పాత్రలో న‌టించి లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా రూపొందించారు. ఆ సినిమా సూప‌ర్‌హిట్ అయ్యింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌డానికి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత కల్పనా కోనేరు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆయ‌న తెలుగులో రీమేక్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.

జ్యోతిక పాత్రలో ఎవ‌రినీ తీసుకుందామ‌ని చ‌ర్చించ‌గా వారికి మొద‌ట‌గా గుర్తొచ్చింది అనుష్క‌నే. జ్యోతిక పాత్ర‌లో అయితేనే పాత్రకు బాగా న్యాయం చేస్తుంద‌ని భావిస్తున్నారు. అనుష్క మొన్న‌ ‘భాగమతి’ సినిమాతో మంచి హిట్‌ అందుకుంది. జి. అశోక్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా అనుష్క న‌టించి భ‌య‌పెట్టించి క‌వ్వించేసింది. తర్వాతి తన కొత్త ప్రాజెక్టు గురించి ప్రకటించలేదు. ఇప్పుడు అనుష్క ఖాళీగానే ఉండ‌డంతో మంచి క‌థ కోసం ఎదురుచూస్తోంది. ఈ పాత్ర‌లో ఆమె క‌నిపిస్తే బొమ్మ హిట్టే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -