Saturday, May 4, 2024
- Advertisement -

‘నేల టికెట్’ షూటింగ్‌లో ర‌వితేజ‌కు గాయాలు

- Advertisement -

‘ట‌చ్ చేసి చూడు’ సినిమాతో ప‌రాజ‌యం అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్ర‌స్తుతం ఓ కొత్త త‌ర‌హా సినిమా చేస్తున్నారు. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘నేల టికెట్’ అనే విభిన్న‌మైన సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఈ షూటింగ్ స‌మ‌యంలో ర‌వితేజ గాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం.

మోనో వీల్ నడిపే క్రమంలో అదుపు తప్పడంతో ర‌వితేజ కిందపడిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో రవితేజకు మోస్తరుగా బాగానే గాయాలైనట్టు స‌మాచారం. కానీ చికిత్స నిమిత్తం ర‌వితేజ‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి తరలించారు. మోనో వీల్ నడపడానికి డూప్ సహాయం తీసుకుందామని దర్శకుడు కల్యాణ్ కృష్ణ చెప్పినా రవితేజ విన‌లేదు. రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడడంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గతంలో ఇదే సినిమా షూటింగ్‌లో హీరోయిన్ మాళవిక శర్మకు కూడా గాయాలయ్యాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతా సర్దుకుంటుందని యూనిట్ వర్గాల నుంచి వచ్చిన వార్తను బట్టి తెలుస్తోంది. ‘

పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. రాజా ది గ్రేట్ సక్సెస్ ఇచ్చిన కిక్‌కు రెట్టింపు స్థాయిలో ‘నేల టికెట్’తో పొందాల‌నే ఆలోచ‌న‌లో ర‌వితేజ ఉన్నారు. ఈ ప్రమాదంతో షూటింగ్‌కు బ్రేక్ కలిగే అవకాశం ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -