Monday, April 29, 2024
- Advertisement -

మాస్టర్ భరత్ కి ఒక కన్ను కనిపించదు.. ఏం జరిగింది ?

- Advertisement -

వెంకీ, రెడీ, ఢీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ మంచి పేరు సంపాధించుకున్నాడు భరత్. పెద్దైన తర్వాత ABCD సినిమాలో సెకండ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాగర్ డైరెక్షన్ లో ఓ మూవీ లో నటిస్తున్న భరత్ ఇటివలే ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలకు ఆసక్తికరమైన విషయాలకు చెప్పాడు.

’నాకు ఊహతెలిసినప్పుటి నుండి సినిమాల్లో నటిస్తూనే ఉన్నా. సినిమాలు చేస్తూనే మెడిసిన్ కంప్లీట్ చేశా. ప్రస్తుతం మెడిసిన్‌లోనే డాక్టరేట్ చేస్తున్నా. నేను చెన్నైలో కాలేజ్ జాయిన్ అయ్యా. అప్పుడు బాగా సన్నబడ్డా. ఎందుకంటే ఆసందర్భంలో నాకు మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. నా కన్నుకి పెద్ద దెబ్బ తగిలింది. నా కన్ను ఒకటి పనిచేయదు. కళ్ల జోడుతోనే తిరిగేవాడిని. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే.. వర్కౌట్ చేస్తున్నప్పుడు రాడ్‌లో ఉండే స్ప్రింగ్ వచ్చి కన్నుకి గట్టిగా తగిలేసింది.

డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఆయన చెక్ చేశారు.. అప్పటికే నా కుడి కన్ను కనిపించడం మానేసింది. ఐలో బ్లాక్ ఉంటుంది.. మెడిసిన్ ఇస్తే కవర్ కావచ్చు అన్నారు. కాని ఇప్పటికీ ఆ ఇబ్బంది నాకు ఉంది. ఓవర్ లైట్ చూస్తే ఐ క్లోజ్ అవుతుంది. అందుకే గ్లాస్ పెట్టుకుని కాలేజ్‌కి వెళ్లేవాడిని. నేను లావుగా ఉన్నప్పుడే ఎక్కువ ప్రపోజ్‍లు వచ్చేవి” అని భరత్ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -