Thursday, May 2, 2024
- Advertisement -

టీజర్ రివ్యూ : వినోదాత్మకంగా సాగే ‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్

- Advertisement -

‘పెళ్లిచూపులు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోనే దర్శకుడిగా తనకంటూ ఒక మంచి పేరుని ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకోగలిగాడు. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ ని హీరో గా పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మాణంలో ఒక హీరోగా మారబోతున్నాడు. ఈ సినిమాకి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ జార్జి థామస్, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. టీజర్ చూస్తే ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ మందు, సిగరెట్ వంటి అన్ని రకాల చెడు అలవాట్లు ఉన్న వాడి గా కనిపిస్తాడు. “ఎవరీ ఫోన్ హాజ్ ఏ సీక్రెట్” అంటూ అనసూయ టీజర్ లో తరుణ్ భాస్కర్ ని మీలాంటి వాళ్లు ఫోన్ హిస్టరీ ని, వాట్స్అప్ హిస్టరీ ని డిలీట్ చేస్తుంటారు అంటూ నిలదిస్తూ ఉంటుంది. టీజర్ చూస్తే సినిమా ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ పై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శివ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -