Saturday, May 18, 2024
- Advertisement -

టీ20లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన శ్రీలంక ఫేస్ బౌలర్ మలింగ…

- Advertisement -

టీ20ల్లో శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ మరోసారి తన సత్తా చాటారు. న్యూజిలాండ్‌తో పల్లెకెలెలో జరిగిన మూడో టీ20లో చెలరేగిపోయాడు. టీ20 సిరీస్ ను కోల్పోయిన శ్రీలంక మూడో మ్యాచ్‌లో కూడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసి మరో ఓటమికి సిద్ధమైనట్లు కనిపించింది. కాని మలింగ రంగంలోకి దిగడంతో సీన్ రివర్స్ అయ్యింది.

నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు. వరస బంతుల్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కోలిన్ మన్రో (12), హమీష్ రూథర్‌ఫర్డ్ (0), కోలిన్ డి గ్రాండ్‌హో‌మ్ (0), రాస్ టేలర్ (0) ఓట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సార్లు (ట్వీ20, వన్డే) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2017 లో కూడా సౌతాఫ్రికా మీద నాలుగు వికెట్లు సాధించారు.

మలింగ తర్వాతి ఓవర్లో సీఫెర్ట్‌ కూడా వెనుదిరగడంతో అతని బౌలింగ్‌ విశ్లేషణ 5/5గా నిలిచింది. ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్‌ వేసి మరో పరుగు ఇచ్చిన మలింగ మ్యాచ్‌ను 4–1–6–5తో ముగించాడు. కివీస్‌ 88 పరుగులకే కుప్పకూలి 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మరో వైపు అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గానూ మలింగ నిలిచాడు.పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (97 వికెట్లు) పేరుపై ఉన్న రికార్డును మలింగ బద్దలుగొట్టాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -