Monday, April 29, 2024
- Advertisement -

అమ్మాయిల వెంట పడ్డ నాగబాబు..!

- Advertisement -

నాగబాబుకు మెగా బ్రదర్ గా.. నటుడిగా.. నిర్మాత గా మంచి పేరు ఉంది. ఆయన ఇప్పుడు కాస్త డీసెంట్ గా కనిపిస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం చాలా నాటీ. పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ.. లోపడ మాత్రం చాలా ఫన్నీ. జబర్దస్త్ ద్వారా ఆయనలో ఉన్న మరో మనిషిని మనం అందరం చూడగలిగాం.

అయితే చాలా కాలం నుంచి జబర్దస్త్ జడ్జిగా ఉన్న నాగబాబు.. ఇటివలే ఈ షో నుంచి మరో ఛానెల్ లో ప్రసారం అయ్యే షోకి వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లి వెళ్లగానే తన కామెడీ పంచులు తో తెగ నవ్వించారు. ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అవుతున్న లోకల్ గ్యాంగ్స్ లో తన ప్రేమ కథను చెప్పాడు. అక్కడ ఉన్న యాంకర్ ప్రదీప్.. సర్ మీ లవ్ స్టోరీ గురించి కాస్త చెప్పండి. అప్పట్లో ఎవరినైన ప్రేమించారా ? అనగానే… మోహమాటం లేకుండా సమాధనం చెప్పారు నాగబాబు.

ఒక్కరు ఇద్దరు కాదు.. ఏకంగా 9 మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేసానని.. అంతా ఛీ కొట్టేసారని చెప్పాడు ఈ మెగా సోదరుడు. మనదంతా వన్ సైడ్ లవ్ అంటూ కామెడీ చేసాడు నాగబాబు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం తన మొహం కూడా చూసేవాళ్లు కాదని.. కానీ తాను మాత్రం అలా వెంటపడుతూనే ఉండేవాన్నని చెప్పుకొచ్చాడు. నాగబాబు జవాబుకి అక్కడ ఉన్నవాళ్లంత తెగ నవ్వారు.

ఆ అమ్మాయిలు ఇప్పుడు మీ పొజిషన్ చూసి కుళ్ళుకుంటారేమో సర్ అని ప్రదీప్ అనగానే.. మనకు అంతలేదులే స్వామి అంటూ తనపై తనే సెటైర్ వేసుకున్నాడు నాగబాబు. సో కొత్త ప్రోగ్రాంని కూడా జబర్దస్త్ స్థాయి హిట్ చేయాలని నాగబాబు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు అర్దం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -