Monday, May 20, 2024
- Advertisement -

ట్రక్ అద్దం పగిలింది.. 5వేల కోట్ల నష్టం..!

- Advertisement -

మార్కెట్లోకి ఓ వస్తువును తీసుకొస్తున్నాం అంటే ఆ వస్తువును మార్కెట్లో అమ్మకాలు అయ్యాక.. ఎంత లాభం వచ్చిందనే లెక్కలు వేస్తాం. కానీ ఓ కంపెనీ తమ వస్తువును పరిచయం చేసినందుకే భారీ నష్టాన్ని చూసింది. ఆ కంపెనీ సీఈవో ఒకే రోజులో తన సంపదనలో రూ.5500 కోట్లకు పైగా నష్టపోవాల్సి వచ్చింది.

ఆ కంపెనీ మరేదో కాదు.. ఆటోమొబైల్స్ రంగంలో మంచి పేరు సంపాధించుకున్న అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ టెస్లా. ఈ కంపెనీ ఇటీవలే సైబర్ ట్రక్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ ను తయారు చేసింది. ఈ కంపెనీ సీఈవో ఎలన్ మాక్స్ మాట్లాడుతూ.. ” ఈ ట్రక్ చాలా దృడమైనది. దీని అద్దాలు పగలవు. కావాలంటే మీరే చూడండి’ అని చెబుతూ టెస్లా టిజైనర్ ను ఓ గొడ్డలి తీసుకురమ్మన్నారు. ట్రక్‌ డోర్‌ను గట్టిగా కొట్టారు.

అప్పుడు ట్రక్‌కు ఎలాంటి డ్యామేజ్‌ కాలేదు. ఆ తర్వాత దానిపై ఒక లోహపు గుండు విసిరారు. అనూహ్యంగా ఆ గుండు కారణంగా ట్రక్‌ అద్దం పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన మస్క్‌.. మరోసారి పరీక్షించారు. ఈసారి రెండో అద్దం కూడా పగిలిపోయింది. ఇది కాస్త మీడియాలో ప్రసారం కావడంతో అమెరికా మార్కెట్లలో టెస్లా షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక్క రోజులోనే ఎలన్‌ మస్క్‌ సంపద 768 మిలియన్‌ డాలర్లు(5500 కోట్లకు పైనే) తగ్గి 23.6 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన మాస్క్.. కేవలం అద్దం కారణంగా ఇంత భారీ నష్టాన్ని చూశారు. అయితే ట్రక్ అద్దం పగిలినప్పటికి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే 2లక్షల ఆర్డర్లు వచ్చినట్లు ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ ట్రక్‌ను మరింత మెరుగుపర్చాల్సి అవసరం ఉందని.. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తామని మాస్క్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -