Monday, April 29, 2024
- Advertisement -

తెరవెనుక ‘రంగస్థలం’ పై మెగా షరతులు…… సుకుమార్ తికమకలు

- Advertisement -

సుకుమార్ బ్రిలియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా తెరపై ఫిల్మ్ మేకింగ్‌ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్న గ్రేటెస్ట్ క్రియేటివ్ డైరెక్టర్. కాకపోతే అలాంటి సుకుమార్‌కి కూడా మనవాళ్ళు అస్సలు ఫ్రీడం ఇవ్వరు. కామెడీ కావాలి, ఫైట్స్ కావాలి, హీరోయిజం పండాలి అంటూ షరతులు పెట్టుకుంటూ పోతారు. ఆ మధ్య 1…నేనొక్కడినే సినిమా విషయంలో కూడా ఆ సినిమా నిర్మాతల్లో ఒకరితోపాటు ఇంకా చాలా మంది వేళ్ళు….కాళ్ళు పెట్టారన్నది నిజం. అందుకే పోసాని లాంటి క్యారెక్టర్‌తో కామెడీతో సహా ఇంకా చాలా ఎగస్ట్రాలు యాడ్ అయ్యాయి. మొత్తానికి సినిమా అటూ ఇటూ కాకుండా పోయింది.

ఇప్పుడు రంగస్థలం విషయంలో కూడా అలాంటి కెలుకుడు షురూ అయిందని తెలుస్తోంది. సాధారణంగా రామ్ చరణ్ నటించిన అన్ని సినిమాల పోస్ట్ ప్రొడక్షన్స్ వ్యవహారాల్లో వేలెట్డం చిరంజీవికి అలవాటు. అందుకే ఒక దశలో చరణ్ సినిమాలన్నీ పరమ రొటీన్ అయిపోయాయి. ఆడియెన్స్‌కి కూడా మొహం మొత్తడంతో వరుసగా డిజాస్టర్స్ పడ్డాయి. ఆ వెంటనే ధృవ సినిమాతో ఆ మొనాటనీని కాస్త కవర్ చేసుకున్నాడు చరణ్. పూర్తి మేకోవర్ కోసం సుకుమార్‌తో సినిమా చేశాడు. అయితే సినిమా షూటింగ్ మొత్తం సుకుమార్ అనుకున్నట్టుగానే సాగింది కానీ ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ పైన మాత్రం మెగాస్టార్ మాటే చెల్లుబాటు అవుతోందని తెలుస్తోంది. మెగాస్టార్ స్థాయి వ్యక్తి సలహాలు, సూచనలు అంటూ ఎడిటింగ్ వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడంతో సుకుమార్ కూడా ఏమీ చెప్పలేకపోతున్నాడట. అయితే ప్రాణంగా ప్రేమించి మరీ సినిమాలు తీయడం సుకుమార్‌కి అలవాటు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా మంచి సినిమా తీయాలనుకుంటాడు. కానీ మెగాస్టార్ మాత్రం కచ్చితంగా సినిమా హిట్ అవ్వాలని అనుకుంటాడు. కమర్షియల్ హిట్ పడాలి, డబ్బులు రావాలి అన్నది చిరంజీవి థింకింగ్. ఇక్కడే చిరుకు, సుకుమార్‌కి మధ్య తేడాలు వచ్చేస్తున్నాయని తెలుస్తోంది. మరి ఫైనల్‌గా సుక్కూ క్రియేటివ్ బ్రెయిన్, మెగా కమర్షియల్స్ బ్రెయిన్ మిక్స్డ్ అవుట్‌పుట్ సినిమా హిట్ చేయడంతో పాటు పేరు కూడా తెచ్చుకునేలా చేస్తుందా? లేక మొత్తానికే అటూ ఇటూ కాకుండా పోయి ముంచేస్తుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -