Wednesday, May 22, 2024
- Advertisement -

చంద్రబాబుకు షాక్ : కాపు రిజర్వేషన్ చెల్లదు

- Advertisement -

ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడుకు షాక్ మీద షాక్ త‌గ్గులుతునే ఉన్నాయి.ఇప్ప‌టీకే కేంద్రం నుండి సాయం అంద‌క త‌ల ప‌ట్ట‌కున్న బాబు ప్ర‌భుత్వం, బ‌డ్జెట్ విష‌యంలో లాక్కోలెక పిక్కోలెక చ‌స్తుంది.మ‌రోవైపు ప‌వ‌న్ కూడా చంద్రబాబుకు మ‌ద్ధతు ఇచ్చి త‌ప్పు చేశాను అని ప్ర‌క‌టించ‌డం, జేఎసి ఎర్పాట్లులో ప‌వ‌న్ బిజి బిజిగా ఉన్నాడు.ప్ర‌త్యేక హోదా కోసం వైఎస్ జ‌గ‌న్ త‌న ఎంపిల చేత రాజీనామా చేపిస్తాను అన‌డంతో బాబుకు ఏం చేయ్యాలో అర్థం కావ‌డం లేదు.కేంద్రం ఇప్పుడు మ‌రో పిడుగు చంద్రబాబు పై వేసిన‌ట్లు తెలుస్తుంది. కాపు రిజర్వేషన్ కోటా ప్రయత్నాలకు బ్రేక్ లు వేసేసింది. సుప్రింకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏపిలో ఇప్పటికే రిజర్వేషన్ 50 శాతం దాటిపోయింది కాబట్టి కాపులకు రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ తేల్చిచెప్పింది.

కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిసిల్లో చేర్పించాలని మంత్రివర్గం ఆమోదించిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత అదే బిల్లును అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి సభ ఆమోదం కూడా వేయించుకున్నారు.కేంద్రం వద్ద ఆ బిల్లు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆమోదం పొందదని చంద్రబాబుకు కూడా తెలుసు. అయినా రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్రామాలాడుతున్నారు. కాపులను బిసిల్లో చేరుస్తానన్నది పోయిన ఎన్నికలపుడు చంద్రబాబిచ్చిన హామీ.రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ చంద్రబాబు కోరినా సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. మొత్తానికి రాజకీయంగా లబ్దిపొందుదామని చంద్రబాబు చేసిన ప్రయత్నాలను కేంద్రం అడ్డుకుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -