Friday, May 17, 2024
- Advertisement -

వారిని బండ బూతులు తిడుతున్న మెగా డాట‌ర్‌

- Advertisement -

మెగా డాట‌ర్ నిహారిక ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలాకాలం అయిన‌ప్ప‌టికి ఇప్ప‌టిక వ‌ర‌కు హిట్ లేదు. ఆమెకు హిట్ రుచి ఎలా ఉంటుందో ఇప్ప‌టివ‌ర‌కు చ‌వి చూడ‌లేదు. నిహారిక తాజాగా న‌టించిన సినిమా సూర్య‌కాంతం. గ‌త శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా యావ‌రేజ్ అని టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి చిత్ర యూనిట్ సినిమా కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. హీరోతో క‌లిసి నిహారిక సినిమా ప్ర‌మోషన్స్‌ను గ‌ట్టిగానే చేస్తోంది.

దీనిలో భాగంగా నీహారిక చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. స‌ద‌రు యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తు మహిళలపై జరుగుతున్న అన్యాయాల గురించి మీడియాతో పంచుకుంది. మ‌హిళ‌లపై జ‌రుగుతున్నఅఘాయిత్యాలు కంటే కొంద‌రు మ‌హిళ‌లు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్‌పై కామెంట్ చేయ‌డం దారుణం అని తెలిపింది. . అమ్మాయిలు చీరలు కట్టుకోకుండా పొట్టి డ్రెస్‌లు వేసుకుంటే రేప్‌లు జరుగుతున్నాయంటూ పిచ్చిగా వాదించడం కరెక్ట్ కాదని చెప్పింది. పొట్టి డ్రెస్‌లు వేసుకున్నంత మాత్ర‌నా రేప్‌లు చేస్తారా అంటూ ప్ర‌శ్నించింది నిహారిక‌. వేసుకునే డ్రెస్సులో ఏముండ‌ద‌ని , చూసే క‌ళ్లు, మైండ్ సెట్‌ను బ‌ట్టి ఉంటుంద‌ని , ఇప్ప‌టికి అయిన అలా ఆలోచించే వాళ్ల మైండ్ సైట్ మార‌ల‌ని హిత‌వు ప‌లికింది నిహారిక‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -