Tuesday, May 14, 2024
- Advertisement -

రిపోర్ట‌ర్‌కు స్ట్రాంగ్ కౌంట‌రిచ్చిన స‌మంత‌

- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది స‌మంత‌. టాప్ హీరోలంద‌రితో సినిమాలు చేసి వారికి సూప‌ర్ హిట్ల‌ను అందించింది. తెలుగు , తమిళ భాష‌ల్లో సినిమాలు చేసి తాన‌కు తానే సాటి అని నిరుపించుకుంది. అక్కినేని ఇంటి కోడలు అయిన త‌రువాత వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతుంది. నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది స‌మంత‌. పెళ్లి త‌రువాత వీరిద్ద‌రు కలిసి న‌టిస్తున్న సినిమా మ‌జిలి.

ఈ సినిమాకు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డ‌టంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టింది. దీనిలో భాగంగానే హీరోయిన్ స‌మంత ఓ ఇంట‌ర్య్వూలో పాల్గొంది. ఈ ఇంట‌ర్య్వూలో ఓ రిపోర్ట‌ర్ చొర‌వ తీసుకుని సినిమాలో నాగ‌చైత‌న్య వేరే హీరోయిన్‌తో లిప్ లాక్ పెట్ట‌డం గురించి స‌మంత ఫీలింగ్ ఎంట‌ని ప్ర‌శ్నించాడు. ఈ ప్ర‌శ్న‌కు స‌మంత కాస్తా ఘ‌టుగానే బదులిచ్చింది. నేను డీప్ గా వెళితే వేరొకలా ఉంటుంది.. కానీ వెళ్లను! అంటూ సినిమాటిగ్గానే స్పందించారు.

అయితే బరువెక్కిపోతున్న వాతావరణాన్ని లైట్ వెయిట్ కి తగ్గించేందుకు ఈ రోజుల్లో దర్శకులు సంప్రదాయ బద్ధంగా సినిమాలు తీస్తున్నారు. కథానాయికలు హుందా అయిన పాత్రలు చేస్తున్నారు కదా! అంటూ కవరింగ్ చేసేశారు. నేను న‌టిని దేనిని అయిన అలాగే చూస్తానంటూ ఆ రిపోర్ట‌ర్‌కు కూల్‌గా స‌మాధానం ఇచ్చింది. నాగ చైత‌న్య‌, స‌మంత‌లు న‌టించిన మ‌జిలి సినిమా ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -