Monday, April 29, 2024
- Advertisement -

మెగా లెక్కలు మెగావారికున్నాయి

- Advertisement -

బాహుబలి చరిత్ర సృష్టించిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో  ఎవరి లెక్కల్లో వారు  ఉంటున్నారు.మెగా లెక్కల గురించైతే…. ఇక చెప్పనే వద్దు . తమ ఫ్యామిలీ రికార్డులన్నీ బద్దలైపోయిన దగ్గరనుంచి కొత్త ఛాలెంజ్ లను ఎలా ఫేస్ చేయాలా అని ఒక్కటే డిస్కషన్స్.  

ప్రస్తుతం మెగా హీరోలు మనోవేదనలో పడిపోయారు. ఇప్పటి వరకూ తమ ఫ్యామిలీ హీరోల పేరిట ఉన్నటువంటి రికార్డులన్నీ…. బాహుబలి చెరిపేయడంతో బాహుబలి రికార్డులను తామెలా బ్రేక్  చేయాలా… అనే ఆలోచనలోకి వెళ్లిపోయారు

.అత్తారింటికి దారేది, మఘధీర పేరిట ఉన్నటువంటి కలెక్షన్స్  రికార్డులన్నీ ఇపుడు చెరిగిపోయాయి. ఇపుడున్న పరిస్థితుల్లో మెగా రికార్డులను  ఎవ్వరూ లెక్క చేయడం లేదు.దీంతో రీసెంట్ గా  మెగా మీట్ కూడా అయినట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాలు చెప్పిన దాని ప్రకారం శ్రీనువైట్ల ,చెర్రీ చిత్రంలో మెగస్టార్ అతిది పాత్ర చేసి మఘధీర మాదిరిగా కలెక్షన్ వండర్ క్రియేట్ చేసి…. ఫస్ట్ వీక్లో తెలుగు వెర్షన్ వరకు ఏమైనా అధ్బుతాలు సృష్టిస్తాడేమోనని చెబుతున్నారు.

శ్రీనువైట్ల ,చెర్రీల కాంబోలో రూపొందుతోన్న సినిమాలో చిరును ముందుగా అనుకోలేదు. కాని కథ,కథనాలు బాగా రావడం..కలెక్షన్స్ కు మరింత ఊతమివ్వడానికి చిరు యాడ్ అయితే బాగుంటుందనే ఆలోచన రావడంతో…. 

ఓ పది హేను నిమిషాలు స్క్రీన్ పై కనిపించేలా గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఏదో సాదా సీదాగా ఆలోచించి వేసిన స్కెచ్ లా అయితే కనిపించడం లేదు.ఎట్టి పరిస్థితుల్లోను బాహుబలిని సౌత్ వరకు బీట్ చేయాలనే లెక్కలో ఈసినిమా రూపొందిస్తునట్లు తెలుస్తుంది.అంటే చిరు 150 వ సినిమా రాకముందే ఈసినిమా వస్తుందన్నమాట. చెర్రీతో తన రికార్డులను తానే బ్రేక్ చేసేలా ఈసినిమాను చిరు దగ్గరుండి మరీ నడిపిస్తున్నాడు. 

మార్కెట్లో బాహుబలి రికార్డులను బీట్ చేసే సత్తా…. మెగా హీరోలకు మాత్రమే ఉందనేది ట్రేడ్ మాట.అది కూడా తెలుగు వెర్షన్ వరకు ఆ ఫీట్ చేసే పవర్…. నూటికి నూరుపాళ్లు మెగా వారసులదే.కాకపోతే నందమూరి హీరోలు ఈ ఫీట్ ను ఇప్పడు కాకపోయినా… ఎప్పటికైనా దాన్ని వశం చేసుకోవచ్చు.అయితే ఈ లోపే మెగా హీరోలు బాహుబలి రికార్డులుగా ఉన్నటువంటి తెలుగు రికార్డులను చెరిపేయడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు.ఆ ఫీట్ ను ఈఏడాదే బ్రేక్ చేసే ఛాన్స్ లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వేల ఆ ఫీట్ విషయంటో చెర్రీ వండర్స్ క్రియేట్ చేయకపోయినప్పటికీ… చిరు తన 150 వ సినిమాతో ఏదో ఒకటి చేస్తాననే ధీమాతో ఉన్నాడు. ప్రెస్టీజ్ ఇష్యూతో దహించుకున్న పోతోన్న మెగా హీరోలు ఎట్టి పరిస్థితుల్లోను  బాహుబలి మెడలు వంచేది మేమే ననే ధీమాతో ఉన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -