Thursday, May 2, 2024
- Advertisement -

ఎవడి డప్పు వాడే కొట్టుకోవాలి

- Advertisement -

ఈజీ గోయింగ్ మెంటాలిటి ఎలాంటి ప్రాబ్లెమ్స్ తెచ్చిపెడుతుందో…. ప్రభాస్ కు భాగా అర్ధమైనట్లుంది. అందుకే గేమ్ బజాయించాడు. కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలన్నట్లుగా…..

రానాకు అందనంత ఎత్తులో …. మోడీ సాఫ్ ను కలిసాడు. అంతే మనోడు నేషనల్ మీడియాకు హాట్ టాపిక్ అయ్యాడు.సెల్ఫ్ ప్రమోషన్ తో సిత్రం చూపిస్తోన్న ప్రభాస్ ఇపుడు 

కరెక్ట్  రూట్ లోకి వచ్చాడు.ఎప్పుడూ పద్దతి పద్దతి అంటూ కామ్ గా కూర్చుంటే… లాభం లేదనే విషయాన్ని కాస్త లేట్ గా తెలుసుకున్నాడు, అయినప్పటికీ గేమ్ అయితే భాగానే షురూ 

చేశాడు.నిన్నటి వరకూ తనకు కాకుండా పోతోన్న బాహుబలి క్రెడిట్ ను…. ఇపుడు తన ఖాతాలో వేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.రానాకు ధీటుగా తనకున్న సర్కిల్ లోని పరిచయాలను వాడుకుని 

ఫ్యామిలీతో మోడీ సాప్ ను మీట్ అయ్యాడు.

మోడీని అలా కలిసాడో లేదో…. ఒక్కసారిగా నేషనల్ మీడియా మనోడ్ని వెంటనే కలిసింది.నేషనల్ మీడియా కూడా ఇండియన్ బాహుబలిని… సినిమా బాహుబలి మీట్ అయ్యాడంటూ వార్తలు రాయడం మొదలు పెట్టింది.

దీంతో నిన్నంతా ప్రభాస్ వార్తలతోనే సోషల్ మీడియా నిండిపోయింది.అంతే అసలు సిసలు బాహుబలి హీరో ప్రభాసే అనే విషయం వెలుగులోకి వచ్చింది.నిజానికి ప్రభాస్ కు మోడీని కలిసే ఆలోచన ఏమాత్రం లేదంటూ అంతా చెబుతున్నారు. కాకపోతే బిటౌన్ మీడియా….ప్రభాస్ ను ఎప్పుడైతే ప్రక్కన పెట్టి రానాను స్టార్ గా ట్రీట్ చేయడం మొదలు పెట్టిందో…. అప్పటినుంచి లేనిపోని ఇగోలు ప్రభాస్లో కూడా మొదలయినట్లుగా తెలుస్తోంది.అందుకే కాబోలు….అప్పటి వరకూ మెయిన్ టైన్ చేసిన ఈజీ గోయింగ్ మెంటాలిటీని  ప్రక్కన పెట్టి…తనని తాను సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడం మొదలు పెట్టాడు.అందుకే కొట్టడం కొట్టడం ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టేసాడు.

బాహుబలి ఇంతలా గేమ్ బజాయించడానికి మెయిన్ రీజన్… అతని వెల్ విషర్స్ ,ఫ్రెండ్సే కారణం. ఎంత కాలం ఇలా మౌనంగా కూర్చుంటూ సినిమా చూస్తావ్ అంటూ…. గత కొన్ని రోజుల నుంచి ఫ్రెండ్స్ మన హీరోగారిని సతాయించడం మొదలు పెట్టారట.మొన్నామధ్య నిత్యామీనన్ సైతం ప్రభాస్ ఎవరంటూ ఓ కొశ్చన్ వేసింది. దీనికి తప్పు నిత్యామీనన్ ది ఎంత మాత్రం కాదు. కేవలం మన హీరోగారు… మిగతా హీరోల మాదిరిగా హడావిడి చేయకపోవడమే… దీనికి అసలు సిసలు కారణం. ఎవరో అన్నట్లు… మన డప్పు మనమే కొట్టుకోవాలి.లేకపోతే వీకైపోతామనే మాట ప్రభాస్ విషయంలో నూటికి నూరు శాతం నిజమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -