Thursday, May 16, 2024
- Advertisement -

నందమూరి హీరోలతో పోటీకి మెగా హీరో నో..!

- Advertisement -

ఒకవైపు సంక్రాంతికి రెండు భారీ సినిమాలు విడుదల అవుతున్నాయి. అది కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు హీరోలు.. బాబాయ్, అబ్బాయ్ లు అమితుమి తేల్చుకుంటున్నారు. సంక్రాంతి ఛాంపియన్ బాలయ్య, ఆయన అన్న కొడుకు జూ.ఎన్టీఆర్ లు ఒకేసారి తమ సినిమాలతో వస్తున్నారు.

దీంతో సంక్రాంతి పోరు ఆసక్తికరంగా మారింది. బాబాయ్, అబ్బాయిల్లో ఎవరు విజేతగా నిలుస్తారు? అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. కేవలం ఈ రెండు సినిమాలే గాక సంక్రాంతికి మరిన్ని చోటా సినిమాలుకూడా పోటీలో ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలు, చిన్న హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి.

రెండు నందమూరి మద గజాల మధ్య ఆ సినిమాల్లో ఎలానలిగిపోతాయో.. అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామమే. ఇదిలా ఉంటే.. మరో సినిమా కూడా సంక్రాంతి పోటీకి తయారైందనే వార్తలు వచ్చాయి. ఆ సినిమానే “లోఫర్” పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారని అన్నారు.అయితే చివరకు ఈ సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి వరకూ వేచి చూస్తే.. అప్పుడు తీవ్రమైనపోటీ ఉంటుందని, పెద్ద సినిమాలున్నాయని.. భావించి ఈ సినిమాను డిసెంబర్ 18న విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ విధంగా సంక్రాంతి పోటీని బాబాయ్ అబ్బాయిలకే వదిలి పెట్టాడు మెగా ఫ్యామిలీకి చెందిన హీరో. ఆ రచ్చకు తను దూరంగా ఉంటున్నాడు. కేవలం వరుణ్ తేజ మాత్రమే కాదు.. ఈ సంక్రాంతి పోరుకు మొత్తం హీరోలంతా దూరంగా ఉన్నట్టే! పోటీ అంతా నందమూరి వారి మధ్యనే!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -