Thursday, May 16, 2024
- Advertisement -

హీరోయిన్లతో ఎఫైర్స్ గురించి చెబుతానంటూ ఊరిస్తున్న డైరెక్టర్!

- Advertisement -

వర్మ తన ఆటో బయోగ్రఫీతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. సినిమాల సందడి తగ్గి ఇతర హడావుడి ఎక్కువగా చేస్తున్న వర్మ ఇప్పుడు మరో పుస్తకంతో వచ్చాడు. ఇది వరకే వర్మ తెలుగులో “నా ఇష్టం” అనే పుస్తకం ఒకటి రచించాడు. అందులో వర్మ పైత్యంతో పాటు.. కొన్ని కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే ఉన్నాయి.

అదలా ఉంటే ఇప్పుడు వర్మ ఆటోబయోగ్రఫీ అంటున్నాడు. దీన్ని ఇంగ్లిష్ లో విడుదల చేస్తున్నాడాయన. దానికి “థింగ్స్ అండ్  గన్స్” అనే ఏదో పేరు కూడా పెట్టినట్టుగా ఉన్నాడు. దాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తానని వర్మ ప్రకటించాడు.

విశేషం ఏమిటంటే.. ఈ పుస్తకంలో తను తన ఎఫైర్స్ గురించి చెబుతానని వర్మ ప్రకటించాడు. ఆడవాళ్లతో తనకు ఉన్న సంబంధాల గురించి ఈ పుస్తకంలో వివరిస్తానని వర్మ ట్విటర్ లో ప్రకటించాడు. మరి ఈ విధమైన మాట ద్వారా వర్మ తన పుస్తకం గురించి జనాల్లో ఆసక్తిని జనరేట్ చేయడానికి ప్రయత్నించినట్టుగా ఉన్నాడు. మామూలుగా బయోగ్రఫీ అంటే ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు. అందుకే వర్మ ఈ ఎఫైర్స్ గురించిప్రస్తావించాడు. ఇలా అయినా తన పుస్తకం గురించి జనాల్లో ఆసక్తి రేగుతుంది.. దాన్ని కొంటారనేది వర్మ ఎత్తు కాబోలు!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -