Tuesday, May 21, 2024
- Advertisement -

మెగా హీరో సినిమా జర్మన్ భాషలోకి డబ్…!

- Advertisement -

తెలుగులో అరుదుగా వచ్చే సినిమాగా… ప్రశంసలు అందుకొంటూ.. అటు కమర్షియల్ గా కూడా వర్కవుట్ అయిన “కంచె” సినిమా ఇప్పుడు సరికొత్త ఫీట్ ను సాధించనుంది. ఈ సినిమాను త్వరలోనే జర్మన్ భాషలోకి డబ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఆ భాషలోకి డబ్ చేసి.. యూరప్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రకారం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. ఆ యుద్ధంతో జర్మనీకి కూడా సంబంధాలున్నాయి. నాటి జర్మన్ నియంత హిట్లర్ కారణంగానే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. మరి ఇప్పుడు ఈ సినిమా అక్కడికి డబ్ కావడం అక్కడి సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమాను ఆ భాషలోకి డబ్ చేయాలని నిర్ణయించారట.

 

ఇది జర్మన్ ప్రేక్షకులనుకూడా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉంది ఈ సినిమా యూనిట్. అలాగే ఇది వరుణ్ తేజ్ కెరీర్ కు కూడా ఒక రేర్ ఫీటే అవుతుంది. మంచి సినిమాలో నటించాడనే పేరుతో పాటు.. ఇలా అరుదైన డబ్బింగ్ వెర్షన్ తో కూడా వరుణ్ తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. మరి ఈ సినిమా హిందీ, తమిళ భాషల్లోకి కూడా డబ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి కంచె వరుణ్ తేజ్ కు మంచి అనుభవాన్ని మిగులుస్తోంది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -