Friday, May 10, 2024
- Advertisement -

రాం గోపాల్ వర్మ వర్సెస్ రాజ్ తరుణ్ గొడవ !

- Advertisement -

దొరికిన వారిని దొరికినట్టు ట్విట్టర్ లో ఆడేసుకునే రాం గోపాల్ వర్మ ఆయన్ని తిరిగి ఎవరన్నా ఆడుకుంటారు అని ఎప్పుడూ ఊహించి కూడా ఉండరు.

ఆయనతో త్వరలో సినిమా తీయబోతున్న హీరో రాజ్ తరుణ్ రామూ నే ఆడుకునే పనిలో పడ్డాడు అది కూడా వర్మ కి అడ్డా అయిన ట్విట్టర్ లో. వర్మతో అనుకుని ఇద్దరూ కలిసి ఈ వ్యాఖ్యలు చేసారో లేక అనుకోకుండా జరిగిందో కానీ వర్మా – రాజ్ తరుణ్ లు ట్విట్టర్ లో కొత్త సంచలనం రేపుతున్నారు. త్వరలో నే వర్మ తో ఒక సినిమా చేస్తున్నాడు తరుణ్ ” ఆర్జీవీతో ఓ సినిమా చేయబోతున్నా. అతను జస్ట్ ఓకే ఓకే డైరెక్టర్. అతడికి నేను పెట్టిన పెట్ నేమ్ అప్పారావు” అంటూ తరుణ్ ట్వీట్ చేసాడు. అంతటితో ఆగకుండా  ‘‘నేను నిజాయితీగా ఫీలవుతున్నా.. నేను డైరెక్టర్ అయి ఉంటే రంగీలా – శివ కంటే చాలా బెటర్ సినిమాలు చేసి ఉండేవాణ్ని. అయినప్పటికీ ఆర్జీవీ ఓకే ఓకే’ అంటూ మరొక ట్వీట్ చేసాడు. ‘‘రాజ్ తరుణ్ నటుడిగా కంటే దర్శకుడిగా నాకన్నా పూరి జగన్నాథ్ – వి.వి.వినాయక్- రాజమౌళి తదితరులకన్నా సామర్థ్యం ఉన్నవాడని నిజంగా నమ్ముతున్నా’’ అంటూ రామూ అతని ట్వీట్ లకి సమాధానం చెప్పాడు. ఇదంతా చూసిన వారికి వీరి కొత్త సినిమా కోసం ఇప్పటి నుంచే ట్విట్టర్ లో  సంచలనం రేపుతూ హైప్ తీసుకుని వచ్చే పనిలో పడ్డారా అనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -