Sunday, May 19, 2024
- Advertisement -

నిహారికతో రొమాన్స్‌కు రెడీ అయిన అక్కినేని హీరో..?

- Advertisement -

అక్కినేని అఖిల్ స‌ర‌స‌న హీరోయిన్‌గా మెగా డాట‌ర్ నిహారికా యాక్ట్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. డైరెక్ట‌ర్ సుకుమార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేయాల్సి ఉంది. కాని క‌థ సిద్ధం కాక‌పోవ‌డంతో ఈ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అయితే త‌న ద‌గ్గ‌ర ఉన్న ల‌వ్ స్టోరీతో అఖిల్‌తో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు సుకుమార్‌. దీనికి సంబంధించిన క‌థాచ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో అఖిల్‌కు హీరోయిన్‌గా నిహారికాను తీసుకోవాల‌ని చూస్తున్నాడ‌ట సుకుమార్‌.

మెగా ఫ్యామిలీతో సుకుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక అఖిల్ విష‌యానికి వ‌స్తే మూడు సినిమాలు తీసిన‌ప్ప‌టికి ఒక్క సినిమా కూడా హిట్ లేదు. అటు ఇదే పరిస్థితిలో ఉంది నిహారిక‌. ఆమె న‌టించిన ఏ సినిమా కూడా విజ‌యం సాధించ‌లేదు. ఫ్లాప్‌ల‌లో ఉన్న వీరిద్ద‌రి మంచి హిట్ ఇవ్వాల‌నే క‌సితో ఉన్నాడ‌ట సుకుమార్‌. మ‌రి ఫ్లాప్‌ల‌లో ఉన్న వీరిద్ద‌రికి సుకుమార్ ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -