Monday, May 20, 2024
- Advertisement -

మెగాస్టార్ ‘సైరా’ టీజ‌ర్ పోస్ట‌ర్‌

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150 త‌రువాత ఎంతో ప్ర‌తీష్టాత్మ‌కంగా న‌టిస్తున్న సినిమా సైరా .స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌ను సైరా మూవీగా తెర‌కెక్కిస్తున్నారు.చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.దీనికి సంబంధించిన టీజ‌ర్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఉయ్యాలవాడ గెటప్ లో వెనక్కి తిరిగి ఉన్న చిరు గెటప్ పై ఆసక్తి పెరిగిపోతోంది.

సినిమా టీజర్ నిమిషం పాటు సాగనుంది. ఈ టీజర్ లో చిరు గెటప్ ని మాత్రమే రివీల్ చేయనున్నట్లు ఒక్క డైలాగ్ తోనే టీజర్ కట్ చేసినట్లు చెబుతున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టిస్తుంది. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.సురేంద్రర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని చిరంజీవి త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ స్వ‌యంగా నిర్మిస్తున్నారు.ఖైదీ 150 కూడా రాం చ‌ర‌ణే నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

https://twitter.com/KonidelaPro/status/1031423650984013824/photo/1

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -