- Advertisement -

చిరంజీవా మ‌జాకానా… సైరా టీజ‌ర్‌

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌టిస్తున్న సినిమా సైరా.స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌ను సైరా మూవీగా తెర‌కెక్కిస్తున్నారు.రేపు చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. నిమిషం 19 సెకన్ల పాటు ఈ టీజర్‌లో చిరంజీవి క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుందో చూపించారు.’సైర సైర సైర’ అంటూ నేపధ్య సంగీతంతో మొదలైన టీజర్ లో ఓ బ్రిటిష్ వ్యక్తి ‘సైరా నరసింహారెడ్డి’ అని అరుస్తున్నప్పుడు చిరంజీవి గుర్రం మీద వచ్చిన సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.

‘ఈ యుద్ధం ఎవరిదీ.. మనది’ అనే ఒక్క డైలాగ్ టీజర్ పై అంచనాలను పెంచేసింది. నేపధ్య సంగీతం టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ఉయ్యాలవాడ గెటప్ లో చిరంజీవి లుక్ ఆకట్టుకుంటోంది. సైనికులు, ఓ పెద్ద కోట ఇలా భారీ సెటప్ మొత్తం టీజర్ లో కనిపిస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టిస్తుంది. త‌మ‌న్నా,అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.సురేంద్రర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని చిరంజీవి త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ స్వ‌యంగా నిర్మిస్తున్నారు.ఖైదీ 150 కూడా రాం చ‌ర‌ణే నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -