Saturday, May 4, 2024
- Advertisement -

స్వీట్ కిలో @ రూ.9000..దీని స్పెష‌ల్ ఏంటో తెలుసా..?

- Advertisement -

స్వీట్స్ కిలో రేటు ఐదువంద‌లో వెయ్యో ఉంటే మ‌హాగొప్ప‌. కాని ఈ స్వీట్స్ మాత్రం కిలో రేటు వేల‌ల్లోనే. అస‌లు దీని స్పెషల్ ఏంటో తెలుసుకోవాల‌నుకుంటున్నారా..? ఇంట్లో ఏ శుభ‌కార్యం జ‌రిగినా స్వీట్స్‌కు ఆర్డ‌ర్ ఇస్తాం. పుట్టినరోజు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది స్వీట్లు కొంటూ ఉంటారు. ఈ స్వీట్ ధర మామూలుగా అయితే కేజీ రూ.500 నుంచి 800 వరకూ ఉంటుంది. ఇక డ్రై ఫ్రూట్ స్వీట్స్ ధర రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ ఉంటుంది.

కానీ గుజరాత్ కు చెందిన ఓ స్వీట్ షాపు మాత్రం కేజీ స్వీట్ ను ఏకంగా రూ.9,000 కు అమ్ముతోంది. త్వరలో రానున్న రాఖీ పండుగను పురస్కరించుకుని ఓ ఖరీదైన మిఠాయిని సూరత్ లోని షాపు తయారుచేసింది. కేవలం మిఠాయికి అంత ఎవరు ఖర్చుపెడతారు? అదేమన్నా బంగారమా? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ స్వీట్ ను నిజంగానే బంగారం పూతతో తయారుచేశారు. ఇందుకోసం 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం వాడారు.

ఈ స్వీట్ ను ప్రారంభించాక తమ షాపుకు వినియోగదారుల తాకిడి పెరిగిపోయిందని యజమాని చెబుతున్నాడు. ఈ స్వీట్ అమ్మకాలు కూడా జోరందుకుంటున్నాయని వెల్లడించాడు. మీరు కూడా నొనాల‌నుకుంటే గుజ‌రాత్‌కు వెల్లాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -