Friday, May 17, 2024
- Advertisement -

కనీవిని ఎరుగని రీతిలో మెగా ఫంక్షన్ కానీ..

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 60వ బర్త్‌డే వేడుకలు పార్క్ హయత్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. అతిరథ మహారథులతో పార్క్ హయత్ కిక్కిరిసిపోయింది.

టాలివుడ్ మొత్తం కదిలి వచ్చి పార్క్‌హయత్‌లో గుమిగూడినట్లయింది. కోలివుడ్, బాలివుడ్ నుంచి పలువురు ప్రముఖ హీరోలు హాజరయ్యారు. కని విని ఎరుగని రీతిలో ఈ ఫంక్షన్ ‌మెగా సెలబ్ 60 జరిగిందని సమాచారం. ఈ వేడుకకు సినీ రంగ ప్రముఖులే కాకుండా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. రాత్రి 8గంటలకు ఆరంభమైన ఈ మెగా ఫంక్షన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ డిన్నర్ పార్టీకి అంతా తామై వ్యవహరించిన రామ్ చరణ్, ఉపాసనలు వచ్చిన అతిథులందర్నీ పేరుపేరునా పలుకరిస్తూ ఈ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు.  

కానీ కొందరు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఎప్పుడూ ఏ ఫంక్షన్‌లో అయినా నేను చిరంజీవి అభిమానిని అని చెప్పుకునే రాధిక కనిపించకపోవడం కొంత లోటుగా అనిపించిందట.  చిరంజీవి, విజయశాంతి కలిసి ఎన్నో సినిమాలు చేశారు. ఇక్కడ విజయశాంతి కూడా హాజరు కాకపోవడం కొందరికి చర్చనీయాంశమైంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ హాజరు కాకఫోవడం కొంతమందికి నిరాశ కలిగించిందని సమాచారం. కానీ బాలకృష్ణ ఈ వేడుకకు హాజరు కావడం అందరికి షాక్‌నిచ్చిందట.     

 ఇక పవన్ కల్యాణ్ కూడా పార్టీ మొత్తం సీరియస్‌గా ఉన్నాడట. ఏదో అభిమానుల కోసం వచ్చినట్లుగా ఉన్నాడు తప్ప పవన్‌కు ఆసక్తి లేదని పలువురు సినీ ప్రముఖుల చర్చ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -