Thursday, May 16, 2024
- Advertisement -

తెలుగుదేశం పార్టీ పేరు మారుతుందా.. ఎందుకు అలా?!

- Advertisement -

ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలు తరచూ తమది జాతీయ పార్టీ అనే ప్రకటనలు చేస్తున్నారు. తాము కేవలం ఆంధ్రప్రదేశ్ కు పరిమితం అయిన వాళ్లం కాదు.. జాతీయ స్్థాయిలో రాణించేస్తాం.. అంటున్నారు.

కర్ణాటక, తమిళనాడుతో సహా అండమాన్ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా తాము సత్తా చాటతాం అని వారు ప్రకటించుకొంటున్నారు. మరి ఇలాంటి ప్రకటనలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పేరును మార్చాలనే ప్రతిపాదనను కూడా తీసుకొచ్చాయి.

తాజాగా ఈ అంశం గురించి తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత సమావేశంలో కూడా చర్చించారు. తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయి పార్టీ గా ప్రమోట్ చేయడంలో భాగంగా పార్టీ పేరును మార్చాలని తెలుగుదేశం నేతలు కొంతమంది ప్రతిపాదించారు. ‘తెలుగుదేశం’ అనే పేరుతో కర్ణాటక. తమిళనాడు లేదా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళితే ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆ పార్టీ నేతలు అభిప్రాయాపడ్డారు. కాబట్టి పేరు మార్చాలని వారు అంటున్నారు.

మరి ఇదెలా ఉందంటే.. కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడినట్టుగా తయారవుతుంది పరిస్థితి. తెలుగుదేశం అనే పేరు మారిస్తే ఆ పార్టీకి మిగతా రాష్ట్రాల్లో కలిగే లాభం ఏమిటో కానీ.. చాలా నష్టాలే జరుగుతాయి. అలాంటి వాటిలో ఒకటి సైకిల్ గుర్తును కోల్పోవడం. ఇప్పుడు కొత్తగా పార్టీ పేరును మాడిఫై చేస్తే అప్పుడు సైకిల్ గుర్తు పోతుంది. మరో గుర్తును వెదుక్కోవాల్సి వస్తుంది. ఈ ప్రమాదాన్ని తెలుగుదేశం నేతలు గుర్తించారు. అందుకు ఈ అంశంపై మరింతగా చర్చిద్దామని.. తర్వాత కావాలంటే నిర్ణయం తీసుకొందామని వారు డిసైడ్ చేశారు. మరి తెలుగుదేశం పార్టీ పేరును మారుస్తారో లేదో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -