Wednesday, April 17, 2024
- Advertisement -

రామ్ చరణ్ పై చిరు ఆసక్తికర కామెంట్స్

- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కించడం, స్టార్ హీరోలు రామ్ చరణ్, తారక్ నటించడంతో మొదటి నుంచి ట్రిపుల్ ఆర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా పది వేల స్క్రీన్స్ పై విడుదలై గ్రాండ్ ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది.

తమ అభిమాన నటులు యాక్షన్ చూసి ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇక ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. తాజాగా మెగా స్టార్ చిరంజీవి ఆర్ఆర్ఆర్ సినిమాలను చూసి .. తన తనయుడు రామ్ చరణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అదిరిపోయిందంటూ వ్యాఖ్యానించారు.

ఇక ఇందులో తన తనయుడు రామ్ చరణ్ నటన చూసి గర్విస్తున్నానన్నారు. రామ్ చరణ ఇంటి దగ్గర చిరు చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తన కుమారుడికి మంచి గుర్తింపు వస్తుండటంతో చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారంటున్నారు ఆయన అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -