Saturday, April 20, 2024
- Advertisement -

తల్లి గురించి గొప్పగా చెప్పిన మెగాస్టార్..!

- Advertisement -

టాలీవుడ్ లో మెగాస్టార్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన రీఎంట్రీ తర్వాత కూడా అదే క్రేజ్ ను కంటీన్యూ చేశారు. అయితే ఆయన ఇటీవలే నటించిన సైరా సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో మంచి ఉత్సహంలో ఉన్నారు. ఇటీవలే బిగ్ బాస్ ఫైనల్ లో కూడా పాల్గొని అందరిని కడుపుబ్బా నవ్వించారు. తాజాగా ఆయన ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమకు హాజరయ్యారు. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మకంగా అందజేసిన ఈ అవార్డులను 2019గాను ప్రముఖ నటి రేఖకు అందించారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. గతంలో ఎప్పుడూ చెప్పని ఓ ఆసక్తికర విషయం చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచాడు. అదేంటంటే..”అదో పల్లేటూరు. అక్కడో జంట. ఆమె గర్భవతి. రేపో.. మాపో డెలవరీకి సిద్దంగా ఉంది. ఆ సమయంలో తన అభిమాన నటుడి సినిమా విడుదల అయింది. ఆ సినిమా ఎలాగైన చూడాలన్నది ఆమె కోరిక. అదే విషయంను భర్తకు చెప్పింది. గర్భిణివి కదా.. ఇప్పుడు సినిమా ఎందుకు అన్నారు భర్త. డెలవరీ తర్వాత కొన్ని నెలల పాటు సినిమాకు వెళ్లే ఛాన్స్ లేదు.

కాబట్టి ఇప్పుడు చూడాలకుంటున్నా అని తన మనసులోని మాటను చెప్పింది. ఆమె ఇష్టాని గౌరవించిన అతను.. భార్యను తీసుకుని జట్కా బండిలో పట్నానికి సిద్దమయ్యాడు. గతుకుల రోడ్డు మీదా సినిమాకి వెళ్లడం కష్టం కదా ? అంటే.. పర్లేదని ఉత్సాహంగా బదులిచ్చిందామె. అలా వెళ్తున్న వారి బండికి ప్రమాదం జరగడంతో రోడ్డు పక్కకు జట్కా బండి పడిపోయింది. ఆమెకు చిన్న గాయాలయ్యాయి. ఇంత జరిగిన తర్వాత సినిమానా ? అంటూ భర్త అంటే.. పర్లేదులే అంటూ తన అభిమాన నటుడి సినిమా చూసేందుకు ఉత్సాహం చూపింది.

ఆ సినిమాకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత వెంటనే ఆమె డెలవరీ అయ్యింది. అయితే ఈ కథలో గర్భణి ఎవరో కాదని.. తన తల్లి అంజనాదేవి అని.. భర్త తన తండ్రి వెంకట్రావు అని.. వారు వెళ్లింది 1955లో రోజులు మారాయి అన్న సినిమాని. ఆ చిత్రం హీరో ఏఎన్నార్ అని.. తన తల్లికి నాగేశ్వరరావు అంటే అంత అభిమానమని చిరు చెప్పారు. అన్ని చెప్పి.. ఆ రోజున తన తల్లి కడుపులో ఉన్నది ఎవరో కాదు.. తానేనని చెప్పారు. ఇలా తాను సినిమాల మీద ఇష్టం పెంచుకోవటానికి తన తల్లి అభిరుచే కారణమన్న విషయాన్ని చెప్పి.. చదువు అయిన వెంటనే మద్రాస్ వెళ్లాలని నిర్ణయించుకోవటంలో తన తల్లికి సినిమా మీద ఉన్న ఇష్టమే కారణమని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -