Wednesday, April 24, 2024
- Advertisement -

హీరోయిన్ రాశి ఎవర్ని పెళ్లి చేసుకుందో తెలుసా ?

- Advertisement -

హీరోయిన్ రాశి.. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ గా ఎదిగి స్టార్ స్టేటస్ సంపాధించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సక్సెస్ లను అందుకుంది. అయితే ఈమె ఎవర్ని పెళ్లి చేసుకుంటుందా అని అందరూ అప్పట్లో ఎదురు చూశారు. అయితే కేవలం నెల రోజుల్లోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ పెళ్లి చేసుకుంది. 2003లో ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు అనే సినిమాలో నటిస్తున్న టైంలో అసోసియేట్ డైరెక్టర్ శ్రీనివాస్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.

దాంతో అందరు ఇది విని షాక్ అయ్యారు. మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో శ్రీనివాస్ ను గమనించిన రాశి.. అతని ఏడిపించాలని.. తన సహాయకురాలిని పిలిచి చెవిలో ఎదో చెప్పిందట. ఆ సహాయకురాలు శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళి మీ గురించి రాశి ఏదో చెబుతుందండీ అని చెప్పిందట. ఏం చెప్పిందో మాత్రం అతనికి చెప్పలేదట. దాంతో కంగారు పడిన అతను రాశి దగ్గరకు వెళ్లి మేడం మీరు ఏదో ఆ అమ్మాయికి చెప్పారట అని అడిగాడట. అప్పుడు రాశి.. రాత్రి ఫోన్ చేసి చెబుతాలే అని చెప్పిందట.

అన్నట్లుగానే రాత్రి ఫోన్ చేసి.. మీరు బాగా కష్టపడుతున్నారండీ,త్వరలో పైకి వస్తారండీ అని చెప్పిందట. అలా రోజూ ఫోన్ లో మాట్లాడుకోవడం ద్వారా షూటింగ్ జరిగే కొద్దీ ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ నడిచిందట. అలా ఇద్దరు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుకునేవారట. ఉన్నట్టుండి 2004మార్చి23న తనను పెళ్లాడాతారా అని రాశి అడగటంతో శ్రీనివాస్ షాక్ అయ్యాడట.

హీరోయినే అడగటంతో శ్రీనివాస్ వెంటనే ఓకే అన్నాడట. ఇక ఇంట్లో కూడా ఆమె విషయం చెప్పడంతో ఇంట్లో కూడా ఒకే చెప్పేసారు. శ్రీనివాస్ ఇంట్లో కూడా ఒకే చేయడంతో అదే ఏడాది ఏప్రియల్ 23న ఇద్దరికీ పెళ్లి అయింది. ఇద్దరికీ ఓ పాప ఉంది. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అంటూ ఇటీవల ఓ ఇంటర్యూలో ఈ విషయాలను చెప్పుకొచ్చింది రాశి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -