Saturday, May 18, 2024
- Advertisement -

ఆ సెంటిమెంట్ ని నమ్ముకుంటున్న ప్లాప్ హీరోయిన్

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమా తో పరిచయం అయిన మెహ్రీన్ కౌర్, ఆ తర్వాత కొన్ని మంచి సినిమాలు చేసినా కానీ ఆశించిన స్థాయి లో మాత్రం విజయం అందుకోవడం లో విఫలమయింది అని చెప్పొచ్చు. అయితే ఈ భామ మాత్రం నిరంతరం కష్టపడుతూ అవకాశాల వేట ని మాత్రం అస్సలు వదులుకోలేదు. అయితే 2017 లో నే సందీప్ కిషన్ తో ఒక తమిళ సినిమా చేసి తమిళ నట అరంగేట్రం చేసినా వెనువెంటనే అవకాశాలు మాత్రం ఈ భామ కి అందలేదు. అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు ఆమె ప్రస్తుతం తన రెండో సినిమా కోసం ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తుంది.

ఈ సినిమా లో ఒక ఛాలెంజింగ్ రోల్ సంపాందించిన మెహ్రీన్ ఎలాగైనా సినిమా తో అందరినీ మెప్పించాలని ప్రయత్నం చేస్తుంది. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం లో ధనుష్ హీరో గా రానున్న పట్టాస్ చిత్రం లో ఈమె నటిస్తుంది. ఈ సినిమా కనుక విజయం సాధిస్తే తమిళం లో మెహ్రీన్ కి తిరుగుండదు. ధనుష్ పక్కన నటించిన హీరోయిన్లు అందరూ వరుస అవకాశాల తో బిజీ అయిపోయారు కనుక మెహ్రీన్ కూడా తన విషయం లో ఆ సెంటిమెంట్ ని నమ్ముకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -