Friday, May 17, 2024
- Advertisement -

మామయ్య తో సినిమా లేదని తేల్చేసిన అల్లుడు

- Advertisement -

తమిళ సినిమా పరిశ్రమ లో ఎన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే ఆటోమాటిక్ గా ఆ సినిమా మీద ఎనలేని క్రేజ్ వచ్చి పడుతుంది. అయితే అప్పుడెప్పుడో రజినీకాంత్, ధనుష్ కలిసి ఒక సినిమా లో నటించనున్నారు అనే టాక్ వినిపించింది కానీ ఆ ప్రాజెక్ట్ మాత్రం ఇంకా ముందుకు కదల్లేదు. అయితే తాజాగా ఈ సినిమా మీద ఒక అప్డేట్ వచ్చింది. ఇటీవలే ధనుష్ స్వయంగా ఈ సినిమా మీద ఒక క్లారిటీ ఇచ్చాడు.

ధనుష్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ, ఎప్పుడైనా తన మామ తో నటించాలి అని తనకి ఉంది అని, ఆ అవకాశం కోసమే చూస్తున్న అని, కానీ ఇప్పుడప్పుడే ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లట్లేదు అని క్లారిటీ ఇచ్చాడు. మంచి కథ, కథనం, అన్నీ సెట్ అవ్వాలి అని, ప్రస్తుతం ఇద్దరూ బిజీ గా ఉన్నారని,అందుకనే ఈ సినిమా మీద ధ్యాస పెట్టడం లేదని చెప్పాడు.

కాకపోతే భవిష్యత్తు లో ఖచ్చితంగా ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది అని చెప్పాడు. గతం లో కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా కి దర్శకత్వం చేస్తాడు అనే టాక్ వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -