Thursday, April 18, 2024
- Advertisement -

బాలయ్య బాబు తో కుర్ర హీరోయిన్

- Advertisement -

బాలకృష్ణ నందమూరి రెండో సారి కెఎస్ రవి కుమార్ దర్శకత్వం లో రూలర్ అనే చిత్రం లో నటించనున్నాడు. ఈ సినిమా కి సంబందించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెల్లడి అయినా సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయం పైన మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. ఎవరివారి పేర్లో వినిపిస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యం లో తాజా సమాచారం ప్రకారం మెహ్రీన్ కౌర్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తుంది.

మెహ్రీన్ కౌర్ ఈ ఏడాది ప్రథమార్థం లో F2 సినిమా తో పెద్ద విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆ విజయాన్ని కొనసాగించలేకపోయింది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ కి రూలర్ మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. చిరంతన్ భట్ ఈ సినిమా కి సంగీతం అందించనున్నాడు.

ఇదిలా ఉంటె ఈ సినిమా లో పాయల్ రాజపుట్ కూడా హీరోయిన్ పాత్ర చేయనుంది అనే వార్తలు వస్తున్నాయి. సికె ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సీ కళ్యాణ్ ఈ సినిమా ని నిర్మించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -