Monday, May 20, 2024
- Advertisement -

రాఘవేంద్ర రావు.. ఆధ్యాత్మికం నుండి బయట పడ్డట్టేనా?

- Advertisement -

రాఘవేంద్ర రావు తెలుగు సినిమా పరిశ్రమ లో కమర్షియల్ సినిమా కి కొత్త అర్ధం చెప్పిన దర్శకుడు. అది ఇది అని కాకుండా అన్ని రకాల జానర్ లని టచ్ చేసిన దర్శక దిగ్గజం. ఇక తెలుగు లో ఆధ్యాత్మిక సినిమాలు తీయడం లో ఎవరికైనా పట్టు ఉందా అంటే అది కూడా ఈయనే. అన్నమయ్య తో మొదలుకొని తన చివరి చిత్రం ఓం నమో వెంకటేశాయ వరకు ఆయన ఆధ్యాత్మిక చిత్రాలకి మంచి పేరు ఉంది. అయితే ఇక ఇప్పుడు అయన ఒక కొత్త చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఇది ఆధ్యాత్మికత కి చాలా దూరం అని సమాచారం. ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని నేడు ఆయన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు.

“నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR” అని రాఘవేందర్ రావు తన పోస్ట్ లో చెప్పారు.

చూస్తుంటే ఏదో కొత్త ప్రయోగమే చేస్తున్నట్లు ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -