Sunday, May 19, 2024
- Advertisement -

ప్రభాస్ ఖాళీ సమయంలో ఏం చేస్తుంటాడో తెలుసా?

- Advertisement -

బాహుబలి సినిమాతో తెలుగు, తమిళం, హింది భాషల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం బాహుబలి 2 లో బిజీగా ఉన్న ప్రభాస్ ఖాళీ సమయంలో ఏం చేస్తుంటాడో తెలుసా? పుస్తక పఠనం చేస్తుంటాడట . అవును ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా వెల్లడించాడు. తన ఇంట్లో ఓ మినీ లైబ్రరీ ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభాస్.

ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ఏదో ఒక పుస్తకం చదువుతూ మరింత పరిజ్ఞానం పొందుతాడట. పుస్తక పఠనం వల్ల తప్పకుండా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని నమ్ముతున్నాడు ,అందుకే మానసిక వికాసానికి తోడ్పడే పుస్తకాలంటే ప్రభాస్ కు చాలా చాలా ఇష్టమట.

ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ కి నెల రోజుల పాటు సెలవులు ప్రకటించారు కాబట్టి ఇక ఈ నెలంతా ఎన్నిపుస్తకాలు చదువుతాడో. ఈ బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ సినిమా దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే జిల్ సినిమా దర్శకుడు రాధకృష్ణ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -