Sunday, May 19, 2024
- Advertisement -

తగ్గిన ఉష్ణగ్రతలు…

- Advertisement -

భానుడి ప్రతాపం తగ్గింది. ఆదివారం, సోమవారం తెలంగాణ జిల్లాల వాసులు ఎండ నుంచి ఉపశమనం పొందారు. గడచిన పది రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కబోతలతో సతమతమైన ప్రజలకు ఈ వాతావరణం కాసింత స్వాంతన చేకూర్చింది.

ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ జంటనగరాలతో పాటు మెదక్, కరీంనగర్, వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడక్కడ వర్షాలు కూడా కురిసాయి. దేశవ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

విపరీతంగా వచ్చిన గాలుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి కాయలు రాలిపోవడంతో అనేక జిల్లాల్లో రైతులకు నష్టం వాటిల్లింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -