టికెట్ల ధరలు, ఇతర అంశాలపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాదాపు రెండు గంటల పాటు చర్చించిన విషయం తెలుసిందే. ఇంతటితోవార్ కు ఫుల్ స్టాప్ పడిందనుకుంటే.. తాజాగా జగన్ సర్కార్ పై మరో సంచలన ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం.. నైట్ కర్ఫ్యూ పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఇలాంటి ఆంక్షలేమీ లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్దేశపూర్వకంగా సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి ఆంక్షలు అమలు పరుస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదేఅంశంపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందిస్తు తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమేదీ లేదని.. థియేటర్లపై ఆంక్షలు ఎవరికైనా ఇబ్బంది అయితే సినిమాలు వాయిదా వేసుకోవాలని నిర్మొహమాటం గా చెప్పేసిన సినిమాటోగ్రఫీ మంత్రి.
జగన్ సర్కార్ పై వర్మ మరో సంచలన ట్వీట్
రైల్వే స్టేషన్ వెళుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..