షాకింగ్ కామెంట్స్ చేసిన ఎరికా ఫెర్నాండేజ్

- Advertisement -

హీరోయిన్ ఎరికా ఫెర్నాండేజ్‌ సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. గాలిపటం సినిమాలో కథానాయికగా అలరించిన ఎరికా పలు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఎరికా చివరిగా ‘కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే బీ 3’ అనే సీరియల్‌లో నటించి అలరించింది. 2011లో పాంటలూన్స్‌ ఫెమినా మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌, 2010, 2011లో పాంటలూన్స్‌ ఫెమినా మిస్‌ మహారాష్ట్ర అవార్డులు గెలుచుకుంది.

బాలీవుడ్ సీరియళ్లతో తన కెరీర్ ప్రారంభమయ్యింది. పలు సూపర్ హిట్ సీరియల్స్‌లో ఆమె హీరోయిన్‌గా నటించింది. అయితే ఆమెను వెండితెరపై హీరోయిన్‌గా పరిచయం చేసింది మాత్రం సౌత్ ఇండస్ట్రీనే. తాజాగా ఆ సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఎరికా. ‘అప్పట్లో సౌత్‌లో హీరోయిన్లు కొంత బొద్దుగా ఉంటే ఇష్టపడేవారు. నేనేమో సన్నగా ఉండేదాన్ని. అందుకని నా శరీరంపై ప్యాడ్స్‌ పెట్టి మేనేజ్‌ చేయడానికి ప్రయత్నించేవాళ్లు.

వాళ్లు అలా చేస్తుంటే నాకు మహా సిగ్గుగా అనిపించేది. చాలా అవమానంగా ఫీలయ్యేదాన్ని. ప్యాడ్స్‌ పెట్టుకుని నటించేందుకు అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉండేది. వాళ్లు కోరుకున్నట్లు నేను లేనేంటా అని చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరినీ యాక్సెప్ట్‌ చేస్తున్నారు. అది సంతోషకరమైన పరిణామం’ అని ఎరికా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ఎరికా ఫెర్నాండేజ్‌ ఈ విషయాన్ని బయటపెట్టింది.

నాగ‌శౌర్య కు కౌంటర్ ఇచ్చిన సాయి పల్లవి,.. ఎందుకు..?

ఆ ఒక్క సినిమాతో మారిపోయిన త‌ల‌రాత‌

మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా కంగ‌న

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -