జగన్‌ సర్కార్‌ పై వర్మ మరో సంచలన ట్వీట్‌

- Advertisement -

కొంతకాలంగా ట్విటర్ వేదికగా మాటల యుద్ధానికి తెరదించుతూ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. వీరిరువురు ఏపీ సచివాలయంలో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు. ఇంతటితో ట్వీటర్ వార్ కు ఫుల్ స్టాప్ పడిందనుకుంటే.. తాజాగా జగన్‌ సర్కార్‌ పై మరో సంచలన ట్వీట్‌ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ.

మహారాష్ట్రలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్ ధర రూ. 2200/-కి అనుమతి ఇచ్చారని….. ఉత్తరాది రాష్ట్రాల్లోను ఐనాక్స్ చిహ్న మల్టీప్లెక్స్ చైన్ ఆర్‌ఆర్‌ఆర్‌ టిక్కెట్లను రూ. 2200కి విక్రయిస్తోందన్నారు. కాని రాజమౌళి సోంత రాష్ట్రాంలో రూ. 200/-కే పరిమితం చేస్తున్నారు అంటే.. కట్టప్పను ఎవరు చంపారు ? అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. ఈ వివాదానికి ఫుల్‌ స్టాప్‌ ఎప్పుడు పడుతుందో చూడాలి.

- Advertisement -

ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని అనుకోవడం లేదు: ఆర్జీవీ

క్రేజ్ ఉన్నప్పుడే సొమ్ము చేసుకోవాలంటున్న బాలయ్య

ధర్మాన ధర్మ సంకటం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -