Friday, May 10, 2024
- Advertisement -

అన్నీ పొగడ్తలే అనుకుంటే బాబుకు, బాలయ్యకు అదరగొట్టే పంచ్ ఇచ్చిన మోహన్‌బాబు

- Advertisement -

ఫంక్షన్ ఏర్పాటు చేసిందే ఆహా……..ఓహో…….అన్న పొగడ్తల కోసమే కాబట్టి……తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటుల్లో ఎక్కువమందికి తెరపైన కంటే నిజజీవితంలో నటించడమే బ్రహ్మాండంగా వచ్చు కాబట్టి ఓ స్థాయిలో రెచ్చిపోయారు. ఎన్టీఆర్‌పై పొగడ్తల విషయంలో ఎవ్వరూ ఏమీ ఫీలవ్వరు కానీ బాలకృష్ణను కూడా స్థాయికి మించి పొగడడంలో సినిమా వాళ్ళు పోటీపడడంతోనే అభిమానుల విషయం ఎలా ఉన్నా సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఎబ్బెట్టుగా అనిపించింది. అన్నింటికీ మించి ట్రైలర్‌లో క్రిష్ కష్టం, ప్రతిభ అద్భుతంగా కనిపించింది. కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్‌లా ఎక్కడా కనిపించలేకపోయాడు అన్నది వాస్తవం. అలాగే బాలయ్య వాయిస్ ఎన్టీఆర్ వాయిస్‌కి దగ్గరలో కూడా లేదు అన్నది నిజం. ఇక దుర్యోధనుడిగా బాలయ్య కామెడీగా ఉన్నాడన్నది నెటిజనుల టాక్.

అయినప్పటికీ సినిమా వాళ్ళు మాత్రం ఆహా…..ఓహో అని అదరిపోయే రేంజ్‌లో ఎన్టీఆర్ సినిమాలో బాలయ్యను మించి జీవించేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇదే ఫంక్షన్‌కి వచ్చిన మోహన్ బాబు మాత్రం తన ముక్కుసూటితనాన్ని మరోసారి బయటపెట్టేసుకున్నాడు. తెరపైన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరికంటే ప్రతిభావంతుడు అయినప్పటికీ నిజ జీవితంలో నటించే విషయంలో మాత్రం మోహన్ బాబు చాలా పూర్. అందుకే అన్నగారి గొప్పతనం గురించి అద్భుతంగా ప్రశంశిస్తూ అలాంటి అన్నగారి జీవితంలో ఉన్న దుష్టులను, దుర్మార్గులను కూడా సినిమాలో చూపించారా? అంటూ ఫిల్మ్ మేకర్స్‌ని అడిగాడు. దాంతో బాలయ్య, క్రిష్‌ల మొహాల్లో ఆందోళన కనిపించింది.

అయితే ఆ తర్వాత మోహన్‌బాబునే చూపించే ఉంటారు అనుకుంటున్నాను……….. చూపిస్తేనే అత్యద్భుతం అనే స్థాయిలో తన ప్రసంగాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోయాడు. అన్నింటికీ మించి స్టేజ్ దిగి వచ్చిన తర్వాత మాత్రం ఫంక్షన్ జరిగిన ఆడిటోరియంలోనే మోహన్‌బాబుపై బాలయ్య విరుచుకుపడ్డాడని తెలుస్తోంది. అయితే మోహన్‌బాబు కూడా ఎక్కడా తగ్గకుండా నీ తండ్రికి న్యాయం జరగాలి………నీ తండ్రికి అన్యాయం చేసిన దుష్టుల గురించి నేను మాట్లాడితే నువ్వు ఎందుకు రెచ్చిపోతున్నావ్ అంటూ బాలయ్యను ప్రశ్నించాడట. తెరపైన, వేదికలపైన చూపించే పౌరుషం నిజ జీవితంలో లేదా అన్న మాటలతో బాలయ్య ఆవేశపడ్డాడని తెలుస్తోంది. ఆ తర్వాత సినిమా పెద్దలు సయోధ్య కుదర్చడంతో ఇష్యూ సైలెంట్ అయింది. అయితే ఇప్పుడు ఇవే మాటలు సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో కనిపిస్తూ ఉండడం ప్రజల మనోభావాలు ఏంటో తెలియచేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -